మహానంది క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు…!

కర్నూలు జిల్లా,
మహనంది,
ఈరోజు టీవీ న్యూస్:
మహానంది క్షేత్రం లో ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు,ముందుగా తెల్లవారుజామున 4 గంటలకు 

అమ్మవారి మూలమూర్తులకు విశేషంగా నవరాత్రి పూజా అభిషేకార్చనలు జరిగినది.ముందుగా స్వామివారి అనుఙ్ఞ, గోపూజ అనంతరం యాగశాల ప్రవేశం గణపతి పూజ పుణ్యాహ వచనము, ఋత్విగ్వరణం, దీక్షాధారణ, అఖండ స్థాపన, మండపారాధన, అగ్ని ముఖము, నవదుర్గా కలశ ప్రతిష్ట, చండి పారాయణ, చండీ హోమములు కూష్మాండ బలి మొదలగు కార్యక్రమములు ఉదయం జరిగింది. లక్షా 50 వేల రూ. 

వెచ్చించి నంద్యాల వాస్తవ్యులు శ్రీమతి, శ్రీ ప్రసాద్ ఆది లక్షమమ్మ దంపతులు అందజేసిన సహస్ర దీపాలంకారములను తొలి సారి దాతల చేతులమీదుగా ప్రారంభించారు.

Please follow and like us:

You may also like...