మను చిత్రం రివ్యూ …

యువ దర్శకుడు, మరియు కథా రచయిత నరేష్ గొళ్లపల్లి మనుచిత్రం గురించి తన మాటల్లో….

చాలా రోజుల తర్వాత సినిమా రివ్యూ రాస్తున్న…అంటున్న యువ దర్శకుడు నరేష్.

 • నేను సినిమా రివ్యూ ఇంక వద్దులే సినిమాల వల్ల బూతు తప్ప సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని రాయడం మానేసా
 • కాని మను సినిమాని చూసి దాని గురించి చెప్పకపోతే నా అంత మూర్ఖుడు ఇంకొకరు ఉండరు అనిపించింది
 • అసలు విషయానికొస్తే
 • నేనొక మీటింగ్ లో విన్నాను ఉత్తేజ్ గారు ఏం చెప్పారంటే
 • సినిమాలో డైలాగ్స్ తక్కువ ఎమోషన్స్ ఎక్కువ ఉంచి సినిమా తీయాలి అన్నారు.
 • నేను మా ప్రెండ్స్ తో ఒరే డైలాగ్స్ తక్కువతో రెండున్నర  గంటలు ప్రేక్షకులను రంజింప చేయగలమా అని వ్యంగ్యంగా అడిగాను
 • కాని అతి తక్కువ డైలాగ్స్ తో ప్రేక్షకులను శ్వాస తీసుకోకుండ రెప్పవేయకుండ 3 గంటల పాటు 
  ప్రేక్షకులను కనువిందు చేసాడు మను సినిమా డైరెక్టర్ పనీంద్ర .
నరేష్ గొల్లపల్లి దర్శకుడు,కథా రచయిత
 • ఈ సినిమా లో కేవలం తొమ్మిది క్యారెక్టర్స్ మాత్రమే కనపడతారు 
 • ఇంటర్వెల్ కి ముందు మహా అయితే ఇరవయో ఇరవైఅయిదో డైలాగ్స్ ఉంటాయి
 • ఈ సినిమాకి స్క్రీన్ ప్లే తండ్రి పాత్ర పోసిస్తే
 • ఎడిటింగ్ తల్లి పాత్ర పోషించిందని చెప్పొచ్చు
 • ఎక్కడో బిగినింగ్ లో ఉన్న సీన్ కి ప్రీ క్లైమాక్స్ సీన్ కి లింక్ పెట్టడం
 • ఒక దీపం వెలుగు ప్రేమకు చిహ్నం గా చూపించడం
 • ఇప్పటి వరకు ఎన్నో హాలివుడ్ సినిమాలు చూసాను గాని ఇలాంటి టేకింగ్
 • ఇలాంటి స్క్రీన్ ప్లే
 • ఇలాంటి క్రియేటివిటి ఏసినిమాలో చూడలేదు
 • ఇప్పటికే మన తెలుగు సినిమా ఇండస్ట్రి ఇండియా లో గొప్పదిగా చెప్పుకుంటున్నారు
 • ఈ సినిమాతో ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటది మన తెలుగు సినిమా స్టమీనా గురించి
 • ఒక సినిమా డైరెక్టర్ కలని స్క్రీన్ మీద చూపించాలంటే 24 క్రాప్ట్స్ పనిచేస్తేనే నిరూపించుకోగలడు
 • అలాంటి కష్ట తరమైన పొజిషన్స్ లో ఉండి ప్రొడ్యూసర్ ని వెతుక్కోడం అంటే
 • మండే ఎడారిలో చెప్పుల్లేకుంట నడవడం లాంటిది
 • ఈ సినిమా స్టోరి ఏ ప్రొడ్యూసర్ కి చెప్పిన ఓకే చెప్పుండేవాడు కాదు
 • ఎందుకంటే ఈ సినిమా కేవలం స్క్రీన్ ప్లే మీద నడుస్తుంది
 • అర్జున్ రెడ్డి, మను , సినిమా స్టోరి రెండు నిమిషాల్లో స్టోరి చెప్పొచ్చు కాని ఎవరు నేను ప్రొడ్యూస్ చేస్తా అని ముందుకొచ్చుండరు.
 • అర్జున్ రెడ్డి సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల పెద్ద కష్టం ఉండకపోవచ్చు
 • ఎందుకంటే రొటీన్ జానర్ లవ్ స్టోరి కాబట్టి
 • మను సినిమా కంప్లీట్ ప్రెష్ జానర్ తెలుగులో
 • ఇలాంటి సినిమాకి ఒకరు కాదు ఇద్దరు కాదు నూటా పదమూడు మంది ప్రొడ్యూసర్లు
 • ప్రాణం పెట్టి క్రౌడ్ పండ్ చేసి తీసారు ఈ సినిమా
 • దయచేసి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి
 • మను సినిమాని చూసి ఆనందించి ఆశీర్వదించండి.

గమనిక :-

 • ఇంట్లో పెల్లం పోరు తట్టుకోలేక ప్రాశాంతంగా సినిమాకెల్లి రిలాక్స్ అవుదాం అనుకునేవాల్లకు ఈ సినిమా పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది,
 • మైగ్రేన్ ఉన్నవాల్లు కూడా చూడటానికి అర్హులు కారు,
 • మీకు ఓపిక తక్కువ బీపి ఎక్కువ ఉందా…? అయితే మీరు కూడా అర్హులు కారు,
 • ప్రెండ్స్ తో గ్రూప్ గా ఈ సినిమాకి వెల్డాం అనుకుంటున్నారా మీరు కూడా ఈ సినిమాకి…సేం ఆస్ అబౌ..,

నోట్ :-

 • కేవలం జ్ఞానానికి కాస్త పదును పెడదాం,
 • తెలివిగా చూసి అర్దం చేసుకుందాం,
 • ఒక పజిల్ ని ఎలా ఓపెన్ చేసారు అని అనుకునేవాల్లు మాత్రమే ఈ సినిమా చూడటానికి అర్హులు,
 • ఈ సినిమాలో కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే భయ్యా
 • చిన్నప్పుడు మనం బుర్ర కధ చూడటానికి వెల్తే కధ
  ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటే దోమలు మాటి మాటికి కరిచి రక్తం తాగుతు ఎలా ఇబ్బంది పెడతాయో 
 • మన పనీంద్ర ఎడిటింగ్ అర్దం చేసుకోడానికి మన బ్రేన్ కి దోమల్లాగే మాటి మాటికి ఇబ్బంది పెడతాడు
 • ఇంతకు మించి చెప్పలేను
 • రాసి రాసి చేతులు నొప్పి పుడుతున్నాయి
 • చదివి మీరు కూడా విసుక్కుంటున్నారు,
 • మనకు ఎందుకీ లొల్లి ..??
 • కొంచెం టాకీస్లా పోయి సూసిరారాదే 
మను తెలుగు చిత్రం ట్రైలర్
Please follow and like us:

You may also like...