మత్తు వదలని కాంగ్రెస్ పార్టీ ?

తప్పుల తడకగా మారిన కాంగ్రెస్ కమిటీ లో పేర్లు….

పార్టీ మారిన నాయకుడికి కమిటీ లో సభ్యత్వం….

పార్టీ మారినప్పటికీ తన మీదే ఆధారపడి రిలీజు చేసిన సభ్యుల పేర్లు….?

కమిటీ ల పేరా లిస్ట్ లు విడుదల చేస్తున్న నేపధ్యం లో అసలు ఇంతకు ముందే మ్యానిఫెస్టో ను విడుదల చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి,మళ్ళి మ్యానిఫెస్టో కమిటీ సభ్యులను ప్రతిపాదించడం అలాగే కమిటీల నియామకాలు ఎలా? అంటే తెరాస పార్టీని తెలంగాణ లో మట్టు బెట్టడమే ధ్యేయంగా గతం లో ఎన్నడూ కలవరనుకున్న పార్టీ ల తో చేతులు కలిపే పరిస్థితి దాపురించిన వేళ, ముందుగా మ్యానిఫెస్టో ను టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ముందు చూపు  ఉందొ లేదో ,లేక కాంగ్రెస్ పార్టి తో కలిసొచ్చే పార్టీలకు మ్యానిఫెస్టో లో స్తానం లేదో అర్థం కానీ పరిస్థితి దాపురించింది.ఈ కమిటీల పేరుతో తీసుకున్న సభ్యులందరు దీంట్లో భాగస్వామ్యం పంచుకునే వారేనా లేక పార్టీ మారిన సురేష్ రెడ్డి లాంటి వారేనా అన్నది అర్థం కాని స్థితిలో ఉన్నది.ప్రస్తుత పరిస్థితులు చూస్తే గత కొన్ని రోజులుగా చూస్తే పార్టీ కోసం ఉత్తేజం తో కొంత పార్టీ కార్యకర్తలు కొనసాగుతున్నారంటే రేవంత్ రెడ్డి లాంటి పోరాట ప్రతిమ గల నాయకుడిని వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేయడం అనేది శుభ పరిణామం ఇది పార్టీ అభిమానుల అభిప్రాయం.నియమించిన తొమ్మిది కమిటీలలో వై కమిటీలలో ఎంత ఉత్తేజం తో పని చేస్తాయో,యెంత నిస్సత్తువ తో ముందుకు వెళ్తుందో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది.

ఒక పార్టీలో సుదీర్ఘ కాలం గా పని చేసి పదవులను అలంకరించి,మళ్ళి పదవి ఆకాంక్ష తో పార్టీలు మారినటువంటి రాజకీయ వ్యభిచారి అయినటువంటి ఆ నాయకుడి పేరుని గమనించలేని స్థాయిలో,అంటే ఓ నలభై యాభై సభ్యులుండే కమిటీ లో పార్టీని వీడి వేరే పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిని గమనించా లేని దుస్థితిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే నాలుగు కోట్ల మంది జనాభా గల రాష్ట్రం ను ఏ విధం గా పర్యవేక్షించే అవకాశం ఉందో మరి.అసలు బూతు స్ధాయి లెవల్ కమిటీలకు చేరుకునే అవకాశం ఉందా ? సభ్యులను గమనించలేని వీరు భూత్ లెవల్ కమిటీ కి చేరుకోగలరా? ఎవరు పని చేసే వారో,ఎవరు పార్టీలో నామమాత్రం గా ఉన్నారో తెలియని పరిస్తితి లో లేని దుస్థితి చుస్తే వీరంతట వీరే ఇప్పుడున్న అధికార పార్టీ తెరాస కి పార్టీ నీ అప్పజెప్పే పర్సితి లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ.

కొసమెరుపు…మ్యానిఫెస్టో కమిటీ ని మ్యానిఫెస్టో లో పొందు పరిచి వివరాలు గోప్యం గ ఉంచాల్సినవి మ్యానిఫెస్ట్ కమిటీ సభ్యుల నియామకం కాక ముందే బయట పెట్టడం దేనికి సంకేతం.గడిచిన కొద్ది రోజుల క్రితమే మ్యానిఫెస్టో ని ప్రకటించి ఇప్పుడు మ్యానిఫెస్టో కమిటీ సభ్యులను నియమించడం ఏంటి? అసలు దాని వెనుక ఉన్న మర్మం ఏంటో మరి?

ఇకపోతే తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ను ఆ కమిటీ కు నియమించడం గల కారణాలేంటో ? 

ఇది ఇలాగే ఉంటే ప్రస్తుతం ఇవన్నీ జరుగుతున్న నేపధ్యం లో ఎవరికీ వారే యమునా తీరే అన్న చందం గా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కొద్ది మంది నాయకులు ఊపిరి పోస్తూ ఉంటే, తమ సీటు కాపాడుకోవడమే ధ్యేయంగా పని చేస్తూ పార్టీని అలాగే ప్రజలను చేరుకోలేని దుస్థితి లో ఉన్న వారు వారి మార్కు చూపిస్తున్నారు. ఒకానొక సమయం లో పార్టీ అధ్యక్షుడికే గట్టి పోటీ ఇచ్చిన డీకే అరుణ లాంటి నాయకురాలికి చిన్న పదవి కట్టబెట్టి చిన్నబుచ్చుకునేలా చేయడం సబబేనా ?

తెలంగాణ కాంగ్రెస్ లో ఎంత మేరకు ఉందో ప్రకటించిన కమిటీలను చుస్తే ఎవరు తమ పార్టీలో ఉన్నారో ఎవరు ఇతర పార్టీలో కొనసాగుతున్నారో తెలియని నిస్పృహ మత్తులో నిస్సత్తువలో ఉండటం కొస మెరుపు.

Please follow and like us:

You may also like...