మత్తు పదార్థాల విక్రయాలపై నియంత్రణ ఏది ? డెమొక్రటిక్ ఫోరం…!


ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో   డెమొక్రటిక్ ఫోరం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది.
ఈ సంధర్భంగా DFO వ్యవస్థాపక అద్యక్షులు కూర్మాచలం ఉమామహేష్ మట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మాదక ద్రవ్యాలు గంజాయి వైట్నర్ సులోషన్ లాంటి పలు రకాల మత్తు గోలీలను మత్తు పదార్థాల రూపంలో విద్యర్థులు యువకులు సేవిస్తూ పట్టుబడటం జరుగుతుందని, అంతేగాక గంజాయి అక్రమ రవాణా కూడ జోరుగా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు .స్కూళ్ళు కాలేజీలు టార్గేట్ చేసుకోని కోందరు మత్తు పదార్థాలను విద్యార్థులకు అలవాటు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .అంతేగాక జిల్లా వ్యాప్తంగా పలువురు యువకులు విద్యర్థులు గంజాయి తాగుతూ పట్టుబడిన ఘటనలు తరచూ జరుగుతున్నరని ఈ మహమ్మారి మూలన విద్యర్థులు యువకులు బలి అవుతున్న ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు . వైట్నరూ మరియు ఇతర మత్తు పదార్థాలు అమ్మే మేడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని మరియు మత్తు పదార్థాల విక్రయలపై పోలీసు శాఖ ద్రుష్టి పేట్టాలని డిమాండు చేశారు .

ఈ కార్యక్రమంలో వేణు,జలంధరు,విక్రం,రవి,భారత్ తిరుపతి,మల్లేష్ ,రజనీకంత్ తదితరులు పాల్గోన్నారు

Please follow and like us:

You may also like...