మంత్రి నారా లోకేష్ సమీక్షా సమా వేశం..!

శ్రీకాకుళం : మందస డిఆర్డిఏ వెలుగు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమా వేశం నిర్వహించారు.

రేపటి నుండి గ్రామాల్లో ఉన్న రేషన్ షాపుల్లో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు,కూరగాయలు పంపిణీ లాంటి తదితర విషయాల్లో ఏమాత్రం జాప్యం ఉండరాదని పేర్కొన్నారు.

గ్రామాల్లో బియ్యం,నిత్యవసర సరుకుల పంపిణీ సులభంగా జరిగేలా ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి ప్రజలకు తోడుగా ఉండాలని పేర్కొన్నారు.

అలాగే గ్రామాల్లో జరిగే సహాయ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అనుసంధానంతో బృందాలు

పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,వ్యవసాయ శాఖ,రెవెన్యూ,ఉద్యాన పంటలు,పశు సంవర్ధక శాఖ మరియు ఇతర శాఖల క్షేత్ర స్థాయి సిబ్బందితో ప్రత్యేక బృందాలు

గ్రామాల్లో సహాయక కార్యక్రమాలు,పంట నష్టం అంచనా అన్ని ఓకే సారి జరిగేలా బృందాలకు సూచనలు

మందసం మండలం లోని 38 గ్రామాలు,244 నివాస ప్రాంతాల్లో మూడు పూటలా భోజనం ఏర్పాటులో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

గ్రామాల్లో పారిశుధ్యం పనులు ఇంకా వేగవంతం చెయ్యాలి

Please follow and like us:

You may also like...