మండల స్థాయి కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,మాజీ ఎంపీ మధు యాష్కీ…!

జగిత్యాల/బండారు గార్డెన్ : జగిత్యాల పట్టణములో నిన్న జరిగిన స్థానిక బండారి ఫంక్షన్ హాల్ లో తాజా మాజీ ఎమ్మెల్యే  జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రేస్ మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మాజీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్,ఎంపీ కవిత కవిత పై ఫైర్ అయ్యారు.

చాతగాని వాడిలా తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దు చేశావు అన్న ఆయన పాపాత్ముల పరిపాలన తొమ్మిది నెలల ముందే రద్దయింది అని దుయ్యబట్టారు.

ప్రజల పక్షాన ఉండి ప్రజలకోసం సేవచేసే నాయకుడు జీవన్ రెడ్డి అని కొనియాడారు.

సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వేలెత్తి చూపని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని స్పష్టం చేసారు. తెలంగాణ భాష గురించి మీ అయ్యను, అన్నను బావ హరీష్ ను అడుగు ప్రశ్నించారు.

2015 లో జరిగిన 4000 మంది రైతుల ఆత్మహత్యలను ఆత్మ హత్యలు కావన్న మీ తండ్రి కేసీఆర్ ఎంత దుర్మార్గుడు.
మీరు పునఃప్రారంబిస్తామన్నమన తెలంగాణా కు చెందిన మన రైతన్నల ఆయువు పట్టు అయిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూత పడింది ఎట్లా,  ఆంధ్రా ప్రాంతానికి చెందినటువంటి  గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుంది.                 
ఇందులో కవిత వాటా ఎంత నో స్పష్టం చేయాలి.
తెరాస పార్టీ ఆఫీసు కట్టడానికి భూమి దొరుకుతుంది కానీ,
పాత్రికేయుల ఇండ్ల స్థలాలకు భూమి దొరకడం లేదు అని దుయ్యబట్టారు.
మీ అయ్య 300 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టుకుంటాడు కానీ పేద ప్రజలకు మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఇస్తావన్న డబుల్ బెడ్ రూమ్ లకు అతీగతీ ఉండదన్నారు.
కుటుంబ పాలన చేస్తూ తెలంగాణను దోచుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీ
అబద్దానికి మారుపేరు కల్వకుంట్ల ఫ్యామిలీ దుయ్యబట్టారు.

ఓటమి భయంతో కేసీఆర్ గత్తర పట్టినట్లుగా మాట్లాడుతున్నాడన్న ఆయన

కల్లు తాగిన కోతిలా చేస్తున్నాడని స్పష్టం చేశారు.

డబ్బు ఎక్కువై వెర్రెక్కి నట్లుగా మాట్లాడుతుండు

కోట్ల విలువ చేసే కార్లలో తిరుగుతున్నారు ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినవి ఎవడబ్బ సొమ్ము

కుటుంభ రాజరిక పాలన పోవాలంటే కాంగ్రెసు అధికారంలోకి రావాలి

జాగృతి పేరుతో కోట్లు గడించిన ఎంపీ కవిత

2015 సంవత్సరంలో 350 మందికి 2005 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తా అని జాగృతి సంస్థ లో ఎన్ని కోట్లు వసూలు చేసి ఎంత మందికి లబ్ధి పొందారు చూపించు చెల్లమ్మ

జాగృతి పెట్టుబడి ఎవరిచ్చారు
తెలంగాణలో కాంట్రాక్టులు ఎవరికీ ఇచ్చారు ఆంధ్ర వాళ్లకు తప్ప
తెలంగాణ జాగృతి అవినీతిపై మీ అయ్యను అన్నను నిన్ను ప్రశ్నిస్తున్నాం

మీ అందరిపై చార్జిషీటు తీసుకువచ్చి రాజకీయ బొంద పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యం
తండ్రి వయసున్న జీవన్ రెడ్డిపై అధికార అహంకారంతో తారతమ్యం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావ్

Please follow and like us:

You may also like...