మంటపాలన్నీ జియో ట్యాగింగ్ చేయబడతాయి…ఎస్పీ సునీల్ దత్.

ఈ నెల 11వ తేదీన జిల్లా ఎస్పీ గా భాద్యతలు చేపట్టిన సునీల్ దత్ ఐపీఎస్ గారిని ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులంతా పుష్పగుచ్చాలతో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు అధికారులందరితో మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల సందర్భంగా జిల్లాలో 1000 పైగా ఏర్పాటు చేయబడిన గణేష్ మంటపాలను జియో ట్యాగింగ్ ద్వారా టిఎస్కాప్  అప్లికేషన్కు అనుసంధానం చేయాలని సూచించారు. ఈ విధంగా చేయడం ద్వారా ప్రతి సంవత్సరం ఎన్ని మంటపాలు ఏర్పాటు చేస్తున్నారో సులభంగా తెలుసుకోవచ్చని తెలియజేసారు.అంతేకాకుండా జిల్లాలోని అన్ని గణేష్ ఉత్సవ కమిటీలు కూడా పోలీసు వారికి సహాయ సహకారాలు అందిస్తూ గణేష్ నవరాత్రులను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని కోరారు.నిమజ్జన ఊరేగింపు సమయంలో డీజే సిస్టమ్స్ ను ఉపయోగించి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించకూడదని తెలిపారు.గణేష్ మంటపాల వద్ద రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని సూచించారు.మంటపానికి కావాల్సినఅన్ని రకాల అనుమతులు పొంది ఉండాలని,అలాంటి అనుమతులు లేని ఉత్సవ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ నకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా పోలీసు వారు సూచించిన నియమాలను పాటించాల్సిందిగా ఉత్సవ కమిటీలను ఉద్దేశించి తెలిపారు.

Please follow and like us:

You may also like...