మంగళవారం జగిత్యాలకు ప్రొ. కోదండరాం…

“జిల్లా కార్యాలయాన్ని” ప్రారంభించనున్న ఆచార్య కోదండరాం….

భారీగా జన సమితిలో చేరికలు…మోటార్ సైకిల్ ర్యాలీ.

జగిత్యాల:జగిత్యాల పట్టణం లో జిల్లా కార్యాలయాన్ని ఆచార్య కోదండ రాం ప్రారంభించిన అనంతరం,ధర్మపురి రోడ్డులోని ఎస్.కె.ఎన్. ఆర్. డిగ్రీ కళాశాల ముందు గల తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంత కర్త, స్వర్గీయ “ప్రొ:కొత్తపల్లి జయశంకర్” సార్ విగ్రహానికి పూల మాల వేసి మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించనున్న ఆచార్య కోదండరామ్, ఆ తదుపరి ధర్మపురి రోడ్డు లోని జయ శంకర్ సార్ విగ్రహం నుండి మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభమై అన్నపూర్ణ చౌరస్తా, పాత బస్టాండ్, తహసీల్ చౌరస్తా, కొత్త బస్టాండ్, కరీంనగర్ రోడ్ బైపాస్ చౌరస్తా, గోవిందుపల్లి చౌరస్తా, సాయి బాబా గుడి ముందు నుండి దేవిశ్రీ గార్డెన్ వరకు జరుగును.
ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో ప్రత్యక్షంగా పాల్గొననున్న కోదండరాం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ గాదె ఇన్నయ్య, ఇతర రాష్ట్ర నాయకులు.

దాచిన చిత్రం

అనంతరం దేవిశ్రీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రసంగించనున్న పలు జన సమితి విభాగాల నేతలు,మహిళా జన సమితి, మైనార్టీ జన సమితి, యువ జన సమితి, విద్యార్థి జన సమితి విభాగాలు ఆ తరువాత వాటికి సంభందించిన నిర్మాణం మరియు నియామకాలు జరుగును.

ఈ సమావేశం లో ఉద్యమాల రథసారథి,నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కోదండరాం ప్రభుత్వ వైఫల్యాలను, ముందస్తు ఎన్నికల డ్రామాను, కుటుంబ పాలనను ఎండగట్టనున్నారని తెలిపారు.

Please follow and like us:

You may also like...