భూముల పంపిణీ కోసం నిరాహారదీక్ష..!

కర్నూలు జిల్లా/మహనంది: మహనంది లోని తహశీల్దార్ క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు ITDA, PO గారు, FRO గారు మరియు తహశీల్దారు గారు కలిసి ROFR చట్టం క్రింద భూములు పంపిణీ చేయవలసిందిగా కోరుతూ గత మూడు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న చెంచు వారితో చర్చించడమైనది. అటవీ భూములను పంపిణీ చేయువరకు దీక్ష విరమించేదిలేదని తెలుపగా DFO గారితో మరియు కలెక్టర్ గారితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమైనది తహశీల్దారు సుబ్బారాయుడు తెలిపారు.


చెంచులకు భూములిచ్చి ఆదుకోవాలి…
ఈరోజు ఉదయం తహశీల్దార్ క్యాంప్ కార్యాలయంలో దగ్గర చెంచులకు సాగుకు అనువుగా ఉన్నటువంటి అటవీ భూములను ఇచ్చి ఆదుకోవాలని మహానంది మాజీ సర్పంచ్ జయసింహారెడ్డి అన్నారు.మహానంది చెంచు గూడెం వాసులు గత మూడురోజులుగా మహానంది తహశీల్దార్ క్యాంప్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష లు చేస్తున్నారు.వీరికి మహానంది గ్రామ మాజీ సర్పంచ్ జయసింహారెడ్డి ,తన అనుచరులతో వెళ్లి మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ప్రకారం చెంచులకు జీవనోపాధి కోసం భూములు ఇవ్వాలని కోరారు.

విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లటం జరిగిందన్నారు.ఈ రిలే నిరాహారదీక్ష లో చెంచు నాయకులు శ్రీనివాసులు,అల్లూరయ్య,పాములేటి,తిరుపతమ్మ,లక్ష్మీదేవి,మూగేన్న,బయ్యమ్మ,ఈదన్న,వీరన్న,నాగమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...