భయంతో రేవంత్ రెడ్డి పై అక్రమ కేసులు…!

రాబోయే ఎన్నికల్లో TPCC కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ టైగర్,కొడంగల్ ముద్దు బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి  ప్రచారం చేస్తే TRS నాయకులు ఓటమి పాలవుతారనే భయంతో ఆయనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తేదీ 28  శుక్రవారం రోజున ధర్మారం మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేయడం జరిగింది.

అనంతరంమండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పుస్కూరు రామారావు మీడియా తో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ,ఇతర కాంగ్రెస్ నాయకులను వేధిస్తూ అక్రమ కేసులు పెట్టి,అనగదొక్కాలని చుతున్నారని అన్నారు.TRS మంత్రులు, నాయకులు అక్రమంగా డబ్బులు సంపాదించారని ముందు వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ★★★★


ఈ కార్యక్రమంలో బ్లాక్-2 కాంగ్రెస్ అధ్యక్షులు సాగంటి కొండయ్య,ధర్మారం మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశం గౌడ్,SC సెల్ జిల్లా నాయకులు పెర్క భానేశ్,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు రేండ్ల నరేష్,గంధం మహిపాల్,రెవెళ్లి తిరుపతి,
అలువాల రాజేశం,ఎదుల్ల అంజయ్య,
సామంతుల నర్సింగం,మంద మల్లయ్య,కాంపెళ్లి పోచయ్య,ముత్యాల వీరాస్వామి,పాలగాని రాజమల్లు,కునారపు చంద్రశేఖర్, నార లక్ష్మణ్,పోల్ దాసరి సంతోష్,పల్లె శ్రీను,పల్లె సంతోష్,బెక్కెం జనార్దన్,లావుడ్య కుమార్,రాజనర్సు,జీళ్ళ కనకయ్య,రాజనాయక్,సందెల తిరుపతి,
తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...