బహ్రైన్‌కు భారీ సాయం చేయనున్న మూడు గల్ఫ్ దేశాలు…!

దుబాయ్: ఆయిల్ ధరల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కరెన్సీ క్షీణత, లోటు వంటి పలు సమస్యలతో సతమతమవుతున్న బహ్రైన్‌కు భారీ ఆర్థిక సాయం చేయాలని గల్ఫ్ దేశాలైన సౌదీఅరేబియా, యూఏఈ, కువైట్ నిర్ణయించాయి. బహ్రైన్ స్థిరత్వమే లక్ష్యంగా 10 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సహాయం చేయనున్నాయి. మూడు దేశాల అధినేతలు ఈ మేరకు సుముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే ఓ ఒప్పందంపై సంతకాలు చేసి ఈ భారీ సాయాన్ని బహ్రైన్‌కు అందించనున్నారు. జోర్డాన్‌లో పర్యటిస్తున్న ఈ మూడు దేశాల నేతలు ఈ విషయాన్ని తెలిపారని అల్ రయ్ అనే పత్రిక పేర్కొంది. ఈ భారీ ఆర్థిక సహాయం బహ్రైన్‌కు చాలా ఉపయోగకరమైన ఐఎంఎఫ్ పేర్కొంది.

Please follow and like us:

You may also like...