బహ్రెయిన్ లో బాధితులకు అండగా నిలిచిన తెలుగు కళా సమితి…!

ఖండాంతరాలు దాటినా మన వాళ్ళు అన్నా మన దేశం మీద ఉండే గౌరవం ఆత్మాభిమానం అంతా ఇంతా కాదు.ఉన్న ఊర్లో ఉపాధి లేక వాతావరణం అనుకూలించక పొట్ట చేత పట్టుకుని వలస వెళ్ళిన ప్రవాస కార్మికుల బాధలు వర్ణనాతీతం, ఎంత చెప్పినా తక్కువే.మాటలకు అందని జీవన విధానం లో ఎన్నో ఒడిదుడుకులు పని భారం, ఆరోగ్య పరిస్థితులు, సమయ పాలన లేని దుస్థితి ఇలా ఎన్నో ఎన్నెన్నో యెంత చెప్పినా మాటలకందని జీవన వైవిధ్యం.

ఇదంతా నాణానికి ఒక వైపు అయితే మరో వైపు వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పాటు అనుకోని సంఘటనలకు భలి అవుతూనే ఉన్నారు. ఈ నేపధ్యం లో రెండు రోజుల క్రితం బహరేన్ దేశం లో సల్మానియా ప్రాంతం లో గల ఓ పురాతన రెండస్తుల భవనం లో గ్యాస్ సిలిండర్ లీకేజి తో ఆ బిల్డింగ్ నేలమట్టం అయింది. ఈ ఘటనలో చాలా ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం సంభవించింది.ఈ నేపధ్యం లో ఓ అడుగు ముందుకేసి మన తెలుగు కళా సమితి వారు అన్నదానం,వస్త్ర దానం చేశారు. అలాగే తెలుగు కళా సమితి సభ్యులు తమ తమ సేవా భావాన్ని చాటుకున్నారు. మేమున్నాం అంటూ చాటి చెప్పారు.


మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని చాటి చెప్పారు…. తెలుగు కళా సమితి సభ్యులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. సోదరులు
మానవత్వాన్ని చాటుకోవటం లో తెలుగు వారి తర్వాతే ఇంకెవరయినా అనటానికి ఇది ఇంకో నిదర్శనం.


ఉదయం నుండి కష్టపడి ఇంటికి చేరుకొని రిలాక్స్ అయ్యే టైం కి మరో పక్క కొందరి కార్మికుల జీవనం అతలాకుతలం అవుతున్న వార్త విని అన్నివిడిచి పెట్టి సహాయం చెయ్యటానికి పరుగులు పెట్టిన మన తెలుగు సభ్యులకి చాలా ధన్యవాదాలు. పురాణాలు పూర్తి గా తెలియదు కానీ గజేంద్రుడు మోర ఆలకించటానికి శ్రీ మహావిష్ణువు కి వందల సంవత్సరాలు పట్టిందిట. కానీ నాకు తెలిసిన టీకేఎస్ సభ్యులు కొందరు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్నారు అని తెలిసింది. ఏ ప్రభుత్వాలు ఆదేశించకున్న వారిలోని మానవత్వమే వారిని పరుగులు తీయించింది.


పొట్టకూటికోసం తనది కాని దేశం వలస వెళ్ళిన కార్మికులు, రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న పదో పరకో ప్రమాదవశాత్తూ కోల్పోయి నడిరోడ్డుమీద నిలబడిన సాటి (మనిషిని) తెలుగువాడికి ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది.

Please follow and like us:

You may also like...