బహరేన్ లో సిలిండర్ పేలుడు తో రెండస్తుల భవనం కూలింది…!

  • సల్మానియా లో సిలెండర్ పేలి పాత భవనం కూలింది..
  • ఇంకా మృతుల సంఖ్య తెలియరాలేదు..

సివిల్ రక్షణ దళాలు సల్మానియ ప్రాంతంలో పాత భవనం యొక్క కేసు కు సంభందించిన పూర్వాపరాలను క్షుణ్ణం గా పరిశీలించి తెలుసుకునే పనిలో నిమగ్నం అయినట్లు తెలుస్తుంది. ప్రారంభ వివరాలు అనేక గాయాలు అయి సూచించబడుతున్నట్లు తెలుస్తున్నది.

అసలు ఏమి జరిగింది…? 

వివరాల్లోకి వెళితే బహరేన్ దేశం లోని సాల్ మానియా ప్రాంతం లో గల ఓ పురాతన రెండంతస్తుల భవనం లో గల ఓ ఫ్లాట్ లో వంటకు వినియోగించే సిలిండర్ ప్రమాదవశాత్తు అనుకోకుండా లీకయిన ఘటన లో ఆ రెండంతస్తుల భవనం కూలి పోవడం తో క్షతగాత్రుల తో పాటు ఆ భావన శిథిలాల కింద అధిక మొత్తం లో మరణించే అవకాశం ఉందని ప్రాథమికం గా తెలుస్తున్నది.ఈ ఘటనలో గాయాలపాలైన క్షత గాత్రులను అలాగే మరణించిన వారిని ఆసుపత్రికి చేర్చుటకు పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో 11 కంటే ఎక్కువ పౌర రక్షణ వాహనాలు, 15 భద్రతా పేట్రియాల్, 60 సిబ్బంది మరియు 19 అంబులెన్సుల ను వారిని మోసుకెళ్లేందుకు సిద్ధం చేశారు.మామూలు మరియు తీవ్రమైన గాయాలతో సుమారు 20 మంది వ్యక్తులు ఆసుపత్రికి తరలించినట్లు భద్రతా సిబ్బంది చెప్పిన వివరాలను బట్టి తెలుస్తున్నది.

blob:https://www.youtube.com/a76bbc92-2ee1-4bd0-bafd-979d0e755816

Please follow and like us:

You may also like...