ఫీజ్ రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి

పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం
విలేకరుల సమావేశంలో ఆది శ్రీనివాస్
చందుర్తి మండల కేంద్రంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఒక్క గొప్ప సంకల్పంతో ప్రవేశ పెట్టిన పథకం ఫీస్ రీఎంబెర్స్మెంట్ అని, పేద విద్యార్థులను ఉన్నతవిద్యకు దూరం చేయవద్దనే ఆలోచనతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు అని, 3000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో విద్యార్థులు కళాశాలల్లో ఇబ్బందులకు గురి అవుతున్నారని, విద్యార్థుల పోరాటం వల్ల తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే ప్రమాదం ఉందని, ఇప్పటి అయిన ఆపద్ధర్మ ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీసరియంబేర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు
ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారుPlease follow and like us:

You may also like...