ప్రశాంతం గా ముగిసిన పరీక్షలు…!

జగిత్యాల జిల్లా….

ఈ రోజు జిల్లా కేంద్రంలోని 28 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పంచాయతి సెక్రటరీ పరీక్ష ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో పలు పరీక్షా కేంద్రాలను, భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీమతి శ్రీ సింధుశర్మ ఐపిఎస్ ,డిఎస్పీ వెంకట రమణ ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది.పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షలు రాయడానికి వచ్చిన అభ్యర్థులకు మరియు వారి కుటుంబ సభ్యులకు సరైన సదుపాయాలు కల్పించడం లో దృష్టి సారించలేకపోయారు.పట్టణం లోని ఓ జూనియర్ కాలేజీ సెంటరు లో మహిళా పరీక్ష రాస్తుండగా ఫిట్స్ రావడం తో కాలేజీ నిర్వాహకులు దగ్గర్లో ఉన్న ఆకుల నాగరాజు ను అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స చేసే పీఎంపి ని తీసుకెళ్లి చేయించారు.

రవాణాసౌకర్యం తదితర అంశాల పై దృష్టి సారించాలని ప్రతీసారి కోరడం తప్పా సామాన్యులకు ఒరిగిందేమి ఉండకపోవడం గమనార్హం.

Please follow and like us:

You may also like...