ప్రతిష్ట కు మ‌చ్చ‌…!

ఢిల్లీ : రాజ‌కీయాల్లో అన్నీ ప‌రిస్థితులూ అనుకూలంగా ఉన్నాయ‌ని ఏ రాజ‌కీయ నాయ‌కుడు ఎప్పుడూ రిలాక్స్ అవ్వ‌డానికి వీలుండ‌దు. ప్ర‌మాదం, ఆప‌ద‌, ముప్పు, అప్ర‌దిష్ట‌, వ్య‌తిరేక‌త,కీడు ఎప్పుడు ఏ మూల‌నుండి వ‌చ్చి మీదప‌డుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొంటాయి. శిఖ‌ర‌మంత ఎదిగిని ఖ్యాతి చిన్న కార‌ణంతో భూస్థాపితం అవుతుందన్న‌ట్టు, రాజ‌కీయాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోయినా, స‌మ‌యోచిత నిర్ణ‌యాలు తీసుకోక పోయినా ఇటుక ఇటుక పేర్చి అందంగా నిర్మించిన‌ అపురూప సౌధం కూడా బీట‌లు వారాల్సిందే..! ప్ర‌స్తుతం ఢిల్లీలో రైతుల‌పై ప్ర‌యోగించిన భాష్ప‌వాయువు, లాఠీ ఛార్జీతో ప్ర‌ధాని మోదీ ఛ‌రిష్మాను మ‌స‌క‌బారేలా చేసింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ట కు మ‌చ్చ‌..! ఆ లాఠీ ఛార్జ్..!! భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ట రోజురోజుకీ మ‌స‌క‌బారుతోందా ? నాలుగున్నర ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ ప‌నిత‌నాన్ని చూసి ప్ర‌శంస‌లు కురిపించిన దేశ ప్రజలు ఇప్పుడు పెదవి విరుస్తున్నారా? అంటే అవును అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ‌ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన పట్ల ప్రజలలో వ్యతిరేకతే తప్ప అనుకూలత రావటం లేదని అంటున్నారు. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ స్ధాయి నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.

Please follow and like us:

You may also like...