Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ప్రజా సంక్షేమమే లక్ష్యం…ఇందిర శోభన్!

ఎందరుంటారు నేడు దారితప్పిన రాజకీయాల్లో వారిలా ?

హైదరాబాదు: ఇందిరా శోభన్ పోశాల ఓ సాదాసీదా గృహిణి, విద్యావంతురాలు ప్రజా క్షేమం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గా ఓ ఫైర్ బ్రాండ్ లేడీ గా ఆ పార్టీలో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో అంటారు రాజకీయ విశ్లేషకులు. తాను నమ్మిన సిద్ధాంతాలతో ముందుకు దూసుకుపోతున్న ఫైర్ బ్రాండ్ ఇందిర ఇటీవలే ఎన్నికల టికెట్ల పంపకాల సందర్భాన అభిమానులతో, ప్రజలతో ఏమన్నారో తెలుసా ?                                                                                                                                                                                          తనలా పార్టీ కోసం అనునిత్యం పాటు పడే వారు, అనునిత్యం నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధి విధానాలను ఎండగడుతూ నిరసన గళం తనదైన శైలి లో వినిపిస్తూ ప్రజల కోసం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నేతలు ఎందరుంటారు అనేది జవాబులేని ప్రశ్నలా మిగిలిపోవాల్సిందే. ఏనుగు దంతాల వలే నేటి రాజకీయ పోకడలు ఉంటున్నాయి తప్ప సంక్షేమం కోసం కాదన్నది నగ్న సత్యం. ఏ వందలో ఒకరు కూడా ఉంటారో లేదో, నేటి రాజకీయాలు ధనార్జనే ధ్యేయంగా ఎంచుకుని ప్రజా సేవ ముసుగులో రాజకీయాలలో కొనసాగుతున్న వారిలో అధికులు ఉన్నారనేది అక్షర సత్యం.                         
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో టికెట్ల పంపిణీ లాబీయింగ్ జోరందుకున్న వేళ, ఓ వైపు అభిమానుల నుంచి, మరో ప్రక్క ప్రజల నుంచి మీరు బరిలో ఉండాలని తీవ్రమైన ఒత్తిడి వస్తున్నప్పటికీ తాను మాత్రం స్పందించిన తీరు సున్నితం గా ఒకే ఒక్క సమాధానం అదే నేడు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ తో గద్దెనెక్కి నియంత పాలనను అవలంబిస్తున్న అహంకారి,  కేసీఆర్ ప్రభుత్వాన్నిప్రారద్రోలేందుకు, ఉద్యమస్ఫూర్తిని కాపాడుకునేందుకు ఇలాంటి త్యాగాలు అనివార్యం అవుతాయని, ఎత్తిన జెండాను దించకుండా నమ్మిన ఆశయం కోసం కంఠంలో ప్రాణమున్నంత  వరకు పోరాడేటోళ్లు ప్రజల కోసం, దోపీడీ పాలనను అంతమొందించేందుకు త్యాగాలు చేయాల్సి వస్తుందని చెప్పే మీలాంటోళ్లు ఎందరుంటారు అనే విషయం గమనార్హం.

Please follow and like us:

You may also like...