పోలీసు నోటీసుకు…బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందన…!

  • తిరంగా యాత్ర ఇల్లీగలా?
  • తిరంగా యాత్ర కు కేసులా?
  • గత ఆరు సంవత్సరాలలో లేనిది ఇప్పుడెందుకు?
  • ఒకరి తరువాత ఒకరిని టార్గెట్ చేస్తున్న కెసిఆర్..
  • తిరంగా యాత్ర తీస్తే కేసు పెడ్తున్నారంటే నాకు సిగ్గేస్తుంది…
  • తెరాస కు అనుభందమేగా, ఎంఐఎం అంటే భయమెందుకు ? ఎమ్మెల్యే రాజా సింగ్.

హైదరాబాదు/అబిడ్స్: ఈ రోజు ఆబిడ్స్ పోలీస్ ల నుండి నాకు నోటీస్ అందింది.దాని సారాంశం ఏంటి అంటే రాజా సింగ్ ఎమ్మెల్యే అయిన మీరు ఆగస్టు 15న ఇల్లీగల్ గా జాతీయ జండా తో తిరంగా ర్యాలీ తీసారు, అని ఉందని అన్న రాజా సింగ్ ఎమ్మెల్యే,అసలు ఆ నోటీసు ఏ ఉద్దేశయం తో ఇచారో నాకైతే అస్సలు అర్ధం అయితలేదు అని పేర్కొన్నారు.ఆగస్టు 15న యావత్తు భారతావని స్వాతంత్య్రం సిద్దించింది అని, ఆ రోజున యావత్ భారత దేశం లో జండా ఎక్కించడం దేశ భక్తి గీతాలు పాడటం తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మిఠాయిలు పంచుకోవడం ఇదో సంప్రదాయం, ఓ పండుగ వాతావరణం లో ప్రజలు కులమత భేదాలు లేకుండా భిన్నత్వం లో ఏకత్వం లా కలసిమెలిసి చేసుకునే జండా పండుగ.కానీ,మన తెలంగాణ రాష్టం లో తిరంగా యాత్ర చేసినందుకు హైదరాబాదు నగరం లో ౫ పోలీస్ ష్టేషన్లలో తిరంగా యాట చేసినందుకు కేసులు పెట్టడం సిగ్గు చేటుగా ఉందని అన్నారు.ఈ నేపధ్యము లో ఆయన మాట్లాడుతూ, ఆ తిరంగా యాత్ర కూడా తాను తీయలేదని వారి నియోజకవర్గానికి చెందిన కొంతమంది యువకులు దాదాపు 2012 సంవత్సరం నుండి తీస్తూ వస్తున్నారని వాపోయారు.

అయినా గతం లో ఏనాడు తిరంగా యాత్ర కోసం గత ప్రభుత్వాల హయాం లో పర్మిషన్ల వ్యవస్థ అడ్డుపడలేదని అన్న ఆయన కేవలం మన తెలంగాణ రాష్ట్రం లో తిరంగా యాత్ర కోసం కేసీఆర్ టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అని వాపోయారు.ఈ సందర్భాంగా నాటి రజాకార్ల వ్యవస్థను ఆ వ్యవస్థలోని తీరు తెన్నులను గుర్తుకు తెచ్చుకుంటూ రజాకార్ల సమయం లో కూడా భారత్ మాతాకీ జై అని నిందిస్తే ఎన్నో ఇబ్బందులకు నాటి రజాకార్ల తొత్తులు ప్రజలను వేధించే వారని అన్నారు.ఎందుకు ఇలా ఒకరి తరువాత మరొకరిని కెసిఆర్ టార్గెట్ చేస్తున్నారు తెలియడం లేదని,ఎంఐఎం కు ఏమైనా భయపడి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారేమో అని పేర్కొన్నారు.చివరగా ఆయన మేము శాంతి యుతం గా చేసిన ర్యాలీకి కేసులు నమోదు చేయడం దురదృష్టకరం అని అన్నారు.అయినా మేము ఆగస్టు న ౨ గంటల్లో తిరంగా యాత్ర శాంతియుతం గా అయిపాయింది.ఎవరికి నష్టం అని కష్టం గాని దానితో పాటు దాడులు చేయలేదని గుర్తు చేశారు.

Please follow and like us:

You may also like...