పోలవరం గాలరీ వాక్కు ప్రారంభించిన చంద్రబాబు…

పోలవరం గేలరీ వాక్కు ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

పోలవరం పైలాన్ ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు….

పోలవరం: భారతదేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన పోలవరం ప్రాజెక్టు కాలంలో నిర్మాణ పనులు చేపట్టామన్నారు.పోలవరం పనులు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషితో 58 శాతం పనులు పూర్తి చేశామన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి 26 సార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించి పనుల వేగాన్ని పరిశీలించాలన్నారు.

2 కిలో మీటర్ నడుస్తూ 200 మెట్లు దిగి లోపలకు వెళ్లి పరిశీలించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి స్పీడు అందుకోవడం ఎవరి తరమూ కాదని లోకేష్ అభివర్ణించారు
పోలవరం కోసం ఇప్పటి వరకు 14.6 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు.
అరవై ఎనిమిదేళ్ళ వయసులో కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని లోకేష్ కొనియాడారు.భవిష్యత్తులో రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా చేయడమే సీఎం లక్ష్యమన్నారు.ఈ సందర్భంగా అధికారుల అందరినీ పేరుపేరునా లోకేష్ అభినందించారు.

మంత్రి దేవినేని ఉమా ఈ సందర్బం గా మాట్లాడుతూ 58 శాతం పోలవరం పనులు పూర్తయితే దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి మహాసంకల్పము కారణమని దేవినేని ఉమ అన్నారు.పోలవరం ప్రాజెక్టునితెలుగుదేశం ప్రభుత్వం సహకారం చేసిందన్నారు.2019 కల్లా ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న సంకల్పంతోనే పోలవరం పనులు జరుగుతున్నాయన్నారు.

ఈ సందర్బం గా స్పీకర్ కోడెల మాట్లాడుతూ నిత్య కృషీవలుడు ప్రజలమనిషి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కోడెల పొగడ్తలతో ముంచెత్తారు.అందరి జీవితాల్లో మరిచిపోలేని మధురాతి మధురమైన రోజు ఈ రోజు అని అన్నారు.అత్యంత వేగవంతంగా పనులు జరుగుతున్న ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అని అన్నారు.అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది తెలిపారు

నిత్యము వరదతో ప్రవహిస్తున్న గోదావరి నదిపైన ఇలాంటి ప్రాజెక్టు కట్టడం కత్తిమీద సాము లాంటిది అని అన్నారు.ఆర్థిక సమస్యలు సాంకేతిక సమస్యలు అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టు పనులు చేపట్టారు అంటే అది కేవలం ముఖ్యమంత్రి ఘనత అన్నారు. ఏడు నెలల్లో పోలవరం ప్రాజెక్టు ప్రజల ముందుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Please follow and like us:

You may also like...