పరీక్ష ప్రశాంతం జిల్లా ఇంఛార్జి ఎస్పీ…రాహుల్ హెగ్డే ఐపిఎస్.

జగిత్యాల : జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన స్టయిఫండరీ పోలీస్‌ కానిస్టేబుళ్ళ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా నిర్వహింబడినట్లుగా జిల్లా ఇంఛార్జి ఎస్పి శ్రీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు తెలిపారు.

ర్రాష్ట్ర పోలీస్‌ నియామక బోర్డ్‌ ద్వారా స్టయిఫండరీ పోలీస్‌ కానిస్టేబుళ్ళ ఉద్యోగాల నియామాకాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1గంటవరకు నిర్వహించిన స్టయిఫండరీ పోలీస్‌ కానిస్టేబుళ్ళ  ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు 7348మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 6905 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హజరకాగా,443 మంది అభ్యర్థులు గైహజర్‌ అయినారు.

సుదూర ప్రాంతాల నుండి పరీక్ష వ్రాసేందుకు నగరానికి వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సరయిన సమయంలో చేరుకోనేందుకుగాను జిల్లా పోలీస్‌ లు లా అండ్‌ ఆర్డర్‌ మరియు ట్రాఫిక్‌ పోలీసుల అధ్వర్యంలో బస్టాండ్లతో పాటు ముఖ్యమైన జంక్షన్ల నందు అభ్యర్థులకు వ్రాతపరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకుగాను హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

ఈ వ్రాత పరీక్ష సందర్బంగా ఎస్పీ గారు పోలీస్‌ నోడల్‌ అధికారి వెంకటరమణ గారు,SB డీఎస్పీ సీతారాములు గారు, రీజీనల్‌ కో ఆర్డినేటర్‌ వేణుగోపాల్,SB ఇన్స్పెక్టర్ రాజశేఖర రాజు, టౌన్ సీఐ ప్రకాష్ గారు కల్సి జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న సరళీతో పాటు పరీక్షా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Please follow and like us:

You may also like...