Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పఠాన్ చెరువు ప్రజా కూటమి అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్

హైదరాబాదు/పఠాన్ చెరువు: తెలంగాణ లో ఎన్నికల నగారా మోగింది. ఈ నేపధ్యం లో ఎన్నికల బరిలో గెలుపు గుర్రాల కోసం పార్టీల వేట మొదలైన సందర్భం గా పఠాన్ చెరువు నియోజకవర్గం నుండి ప్రజా కూటమి అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్ ని వరించింది. ఆయనకు ప్రజకూటమి పఠాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ బీ ఫారం ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల భాద్యుడు ఆర్సీ కుంతియా, భక్త, కత్తి వెంకటస్వామికి అలాగే బెల్య తో పాటు దామోదర రాజనరసింహ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపిన టిపిసిసి అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పోశాల, ఇది ఇలా ఉండగా ఇందిరా మాట్లాడుతూ పఠాన్ చెరువు లో కాట కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అహంకారం తో ఒంటెద్దు పోకడల తో తెరాస విధి విధానాలకు రానున్న రోజుల్లో తెలంగాణ యువత తో పాటు ప్రజలు  బుద్ది చెబుతారని, ఓటు ను వజ్రాయుధం గా వాడుకుని కాంగ్రెస్ పార్టీ కి అలాగే మహాకూటమి అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపినారు

Please follow and like us:

You may also like...