పండిత పరిషత్ (రూప్) ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు….

పండుగలు జాతీయ సమైక్యతకు పెంపొందుతుంది.
జగిత్యాల డి.ఈ.వో. యస్.వెంకటేశ్వర్లు….

జగిత్యాల : మన పండుగలు జాతీయ సమైక్యతకు సూచకాలని, వీటి ద్వారానే జాతీయ సమైక్యత పెంపొందుచున్నది జగిత్యాల జిల్లా విద్యాధికారి యస్.వెంకటేశ్వర్లు గారు అన్నట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు. పండిత పరిషత్ ఆధ్వర్యంలో నేడు జగిత్యా జిల్లా విద్యాశాఖ అధికారికి కార్యాలయ సిబ్బందికి రాఖీలు కట్టిన సందర్భంలో డి.ఈ.వో. మాట్లాడుతూ రాఖీ పండుగ సోదర భావానికి, స్నేహానికి, సౌభ్రాతృత్వానికి ప్రతీకలని భారతీయ సంస్కృతిలో పండుగలకు ఎనలేని ప్రాధాన్యత కలదని, మన పండుగలు ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. అనంతరం *”మీరు నాకు రక్ష, నేను మీకు రక్ష మనమిద్దరం కలిసి మన దేశానికి రక్ష”* అని డి.ఈ.వో కు సిబ్బంది కి రక్షాలు కట్టినట్లు వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్యారంబట్ల సూర్యనారాయణ, చింతామణి కృష్ణస్వామి, చంద సత్యనారాయణ, భుక్య రాజేష్ నాయక్, చంద్రమౌళీ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...