నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ….!

జగిత్యాల జిల్లా

ఈరోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయము లోని పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి శ్రీ సింధుశర్మ ఐపీఎస్ గారు నిర్వహించారు .
ఈ సందర్బముగా ఈ ఎస్పీ గారు మాట్లాడుతు నేరాలను నియంత్రిoచుటకు పూర్తిస్థాయిలో పోలీసు గస్తీ, పెట్రోలింగ్ బ్లూ కోల్ట్స్ , నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని పేర్కొన్నారు, పోలీసు వ్వవస్థ ప్రజల రక్షణకై ముందుండలని తెలిపారు. జిల్లా పోలీసులు ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పదించి జవాబుదారీగా పని చేయాలి అని తెలిపారు.


*రాబోయే ఎలక్షన్స్ దృష్ట్యా ప్రణాళిక ప్రకారం అన్ని చర్యలు తీసుకోవాలి,ప్రతి పోలింగ్ బూత్ జియో ట్యాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఎన్నికలను ప్రశాంతంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్లు నిర్వహించేందుకుగా జిల్లా పరిధిలో పకడ్బంది ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి పోలీసు అధికారి పక్క ప్రణాళికతో సిద్ధంగా వుండాలని, ఇందుకోసం సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించడంతో పాటు, ఎన్నికల సమయంలో గోడవలను సృష్టించే వ్యక్తులను గుర్తించాలని ,సమస్యాత్మక ప్రాంతాల్ని మ్యాప్ లో గుర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన నేరస్థుల సమాచారాన్ని సేకరించి మ్యాప్ లో పాయింట్ చేయాలి.

అలాంటి వారిపై గట్టి నిఘా పెట్టాలి ముఖ్యంగా పోలిస్టేషన్ల వారిగా రౌడీ షీటర్ల జాబితా రూపోందించుకొని వారి కదలికలపై నిఘా పెట్టాలని. ప్రతిరోజు బీట్లు, పెట్రోలింగ్ నిర్వహిస్తూ నివారణ చర్యలు చేపట్టాలి. సిసిటియన్ యస్ ప్రాజెక్టు ద్వారా ప్రతి దరఖాస్తులను మరియు యఫ్.ఐ.అర్ లను, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్ లైన్ లో ప్రతి రోజు ఎంటర్ చేయలని ఆదేశించారు. ప్రతి పి‌ఎస్ లల్లో ఇప్పటి వరకు ఉన్న లాంగ్ పెండింగ్ కేసులను గురించి ,UI కేసులను గురించి కాంపౌండింగ్ కేసులను గురించి అడిగి తెలుసుకోవడము జరిగినది.


*ప్రతి శనివారం కోర్ట్ కానిస్టేబుల్ , స్టేషన్ సిబ్బంది తో స్టేషన్ ఎస్ హెచ్ ఓ సమావేశం నిర్వహించాలి. ఆ నెలలో UI కేసులు, ఇతర కోర్ట్ సంబంధిత సమాచారం మరియు ఏదైనా కేసులో తీర్పు వెలువడి నిందితులకు శిక్ష పడిన లాంటి కేసుల గూర్చి సిబ్బంది తో చర్చించాలి.
*రోజువారి వెహికిల్ చెకింగ్ నిర్వహించాలి. ట్రాఫిక్ నియమనిబంధనలు అందరూ పాటించేలా చూడాలి. టౌన్ న్యూసెన్సు కేసులు, ఈ పెట్టి కేసులు
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ట్రాఫిక్ కి ఆటంకం కలిగించిన వారిపై నమోదు నమోదు చేయాలి.డ్రంక్ నందు డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించాలి.
*జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ లలో పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలి, తప్పనిసరి గా అన్ని పోలీస్ స్టేషన్ లలో 5S
( 5s
1.Sorting
2.Systematization
3.Shining
4.Standardardization
5.Self-discipline)
విధానం పక్కాగా అమలుపరచాలి. ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఈ విధానం పరిశీలించడం జరుగును.
*సి.సి. కెమెరాల ఏర్పాటులో “నేను సైతం /కమ్యూనిటీ సి సి కెమెరా ” వంటి కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజల భాగస్వాములుగా చేయ్యలన్నారు, నేరల నియంత్రణతో పాటు దర్యాప్తు చేధనకు దోహదపడే సి.సి. కెమెరా ల ఏర్పాటు చేసుకోవాలన్నారు . పట్టణ కాలనీలలొ, గ్రామ కూడల్లాలో వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ప్రధాన కూడలి వంటి చోట ఏర్పాటు చేయాలి. అని తెలిపారు.
..
ఈ సమావేశంలో జిల్లా ఎస్ పి గారితో పాటు డిఎస్పీ లు మల్లారెడ్డి గారు,వెంకటరమణ గారు సి.ఐ లు అని పోలీస్ స్టేషన్ SHO లు Dcrb సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు

Please follow and like us:

You may also like...