నిరసన కార్యక్రమం లో పాల్గొన్న అడ్లూరి…!

  • బతుకమ్మ చీరల పంపిణీ పై ముందస్తు ప్రణాళిక లేదు….
  • ఓట్ల కోసమే రాజకీయం…
  • బతుకమ్మ చీరల పంపిణీ అధికారుల ద్వారా చేయమని కోరడం జరిగింది…
  • నాడు పంపిణీ చేసిన సూరత్ నాసి రకం చీరలతో ఎవరికీ వాటి మీద నేడు పెద్దగా ఆసక్తి లేదు…
  • జిల్లాలో అధికులు బడుగు బలహీన వర్గాల వారు, రైతు కూలీలు ఉన్నప్పటికీ ఎక్కడ వారు నిరసనలు తెలిపింది లేకపోవడం గమనార్హం…

గొల్లపల్లి: ఈ రోజున గొల్లపెల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ విఘాతం కలిగిస్తుందని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నిన్న చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధపు ప్రచారాలు ప్రజలను మోసం చేస్తూ మహిళల్ని రెచ్చగొట్టి సెంటిమెంటుతో ఓట్లు రాబట్టడానికి చేసిన కార్యక్రమానికి నిరసనగా, ఈ రోజున గొల్లపెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఐదు సంవత్సరాలు పని చేయడానికి గెలిపిస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షాల మీద లేనిపోని ఆరోపణలు చేయడం కేసీఆర్ కు టీఆర్ఎస్ నాయకులకు అలవాటు గా మారింది. దయచేసి మహిళలు అందరూ కూడా కేసీఆర్ మాటలను నమ్మవద్దు మంత్రివర్గంలో కేసీఆర్ ఇవాళ నాటకాలు నాటకాలు ఆడుతూ నాయకులతో మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి కేసీఆర్ ను టీఆర్ఎస్ నాయకులను రెండోసారి మళ్లీ నమ్మకూడదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ సంతోష్, చంద్రయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ యువకులు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నారు.

Please follow and like us:

You may also like...