Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

నియంత పాలన అంతానికే మహా కూటమి…జీవన్ రెడ్డి….!

నియం పాలన అంతానికే మహా కూటమి ఆవిర్భవించిందని, కల్వకుంట్ల పాలన విముక్తికై అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చాయని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.

బుధవారం ఎన్నికల ప్రచారం లో భాగంగా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం లో గల ఇందిరమ్మ కాలనీ లో ప్రచార కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భారీ సంఖ్యలో సుమారు 200మంది యువకులు, మహిళలు, గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ వెనుకబడిన, అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని అన్నారు..టీఆరెస్ పార్టీ దళితులూ, గిరిజనులు , అల్పసంఖ్యాక వర్గాలతో పాటు రైతు కూలీల పట్ల వివక్ష చూపిందన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన కేసీఆర్ , దళితులకు ఇస్తా అన్న మూడెకరాల భూమి కేటాయించలేదని , ఎస్సి , ఎస్టీ సబ్ ప్లాన్ నిధులలో సగం కూడా ఖర్చు చెయ్యకుండా వివక్ష చూపిందని ఆరోపించారు.

దళితులనుఓట్లు అడిగే నైతిక హక్కు టీఆరెస్ పార్టీ కి లేదన్నారు..స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు ..నాటి కాలం లో ధర్మ గంట కొడితే , రాజు దర్శనమిచ్చేవాడని , నేడు తెలంగాణ రాజు దర్శన భాగ్యమే కరువయ్యింది మంత్రులకు , ఎమ్మెల్యేలకు కూడా ఆ అవకాశం లేకపోవడం శోచనీయం అన్నారు.

సెక్రెటరేట్కు రాకుండా పాలన చేసిన దేశం లో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని జీవన్ ఎద్దేవా చేశారు..మన ఊరు లేదని , దానికో ప్రణాళిక లేకుండా పోయిందని , గ్రామాలకు రాకముందే జ్యోతి ఆరిపోయిందన్నారు ..దీంతో చేసేది లేక తన నెత్తిపై తానూ చెయ్యి పెట్టుకున్నాడని , చిత్తశుద్ధి తో పని చేసేవారిని , ప్రజలకు అందుబాటులో అండగా నిలిచేవారికి మద్దతు ప్రకటించాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు..తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లో జగిత్యాల గొంతు వినిపించే అవకాశం మీ అందరి భిక్షే నన్నారు ..గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు భరోసా లేకుండా పోయిందని , కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే ఎన్నారై నిధి కింద 500కోట్ల కేటాయింపుతో పాటు , గల్ఫ్ కార్మిక మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్గ్రేషియా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు ..వీటితో పాటు సామాజిక పెన్షన్లు రెట్టింపు చేస్తామని , వృద్ధ్యాప్య పెన్షన్ వయో పరిమితి 58 ఏళ్లకు కుదింపు చేస్తామని , ప్రతి పౌరునికి 7 ￰కిలోల బియ్యంతో, 9రకాల వస్తువులు ఉచితంగా అందజేయడంతో పాటు , ఏడాదికి 6సిలిండర్లు మహిళలకు , గృహిణులకు అందిస్తామని పేర్కొన్నారు ..వీటితోపాటు ఇళ్లులేని నిరుపేదల ఇంటి నిర్మాణం కై 5 లక్షల రూపాయలు అందిస్తామని జీవన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు.. అల్లీపూర్ ఇందిరమ్మ కాలనిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కై అధికారం లోకి వచ్చిన తదనంతరం వచ్చే తోలి ఎమ్మెల్యే బడ్జెట్ కోటా నిధులు కేటాయించి సమస్యల పరిష్కారానికి తనవంతు ఎల్లవేళలా అందుబాటులో , అండగా ఉంటానని హామీ ఇచ్చారు ..కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలకాలనీ కోరారు..

ఆశీర్వదించండి ….శ్రీరామ్ నగర్ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా :

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తాజామాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు … బుధవారం రాయికల్ మండలం శ్రీరామ్ నగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ..ఈ సందర్బంగా గ్రామస్థులను కలిసి తనను రానున్న ఎన్నికల్లో అవకాశం కల్పించి ఆశీర్వదించాలని కోరారు ..శ్రీరాంనగర్ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు..ఈ సందర్బంగా ప్రజలు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ..ఈ కార్యక్రమం లో తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జెడ్పిటిసి గోపి మాధవి , టిడిపి గ్రామా అధ్యక్షులు మోర గణేష్, భైరి రాంచంద్రం , లక్ష్మి నర్సయ్య , ఇస్మాయిల్ , mptc అత్తినేని గంగా రెడ్డి, పి.ఏ.సి.సి.ఎస్ ఛైర్మెన్ ￰వెంకటేశ్వర్ రావు, దివాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, తలారి రాజేష్, సాయి, ప్రవీణ్ , భోగ నర్సయ్య , మాజీ సర్పంచ్ జల , ప్రభు , సాయి రెడ్డి , లక్ష్మినారాయణ , కృష్ణ మూర్తి తో పాటు నాయకులూ , కార్యకర్తలు పాల్గొన్నారు..

Please follow and like us:

You may also like...