నిమజ్జనోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా…ఎస్పీ సింధు శర్మ…!

జగిత్యాల/మెట్ పల్లి : జిల్లాలోని మెట్ పల్లి రెవెన్యూ డివిజను ప్రాంతం లో వినాయక నిమజ్జనోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ  సింధు శర్మ ఐపిఎస్ అన్నారు. ఈరోజు వినాయక నిమజ్జనం కోసం మెట్ పల్లి పట్టణ శివారు ప్రాంతంలోని మహాలక్ష్మీ ఆలయ సమీపంలోని వట్టి వాగు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను డిఎస్పి మల్లారెడ్డి మరియు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా చోట్ల చేపడుతున్న భద్రతా చర్యలు ఏర్పాట్లు సమీక్షించారు.

జిల్లా వ్యాప్తంగా జరుగబోయే గణేష్ నిమజ్జనం ను పురస్కరించుకుని జిల్లా పోలీస్ శాఖ, రెవిన్యూ,ఆర్&బి , వైద్య శాఖ ల సమన్వయం తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని పేర్కొన్నారు.
విగ్రహాలను నిమజ్జనం చేయుటకు భారీ క్రేన్స్ ను, బారికేడ్లను ఏర్పాటు చేసి నిరంతరం పోలీస్ నిఘా లో ఉంచడం జరుగుతుందన్నారు.
నిమర్జనం జరిగే ముఖ్య మార్గాలలో  సి సి కెమెరా లను బిగించామని జిల్లా ఎస్పీ సూచించారు.
నిమజ్జనం చేయుటకు వచ్చే ప్రజలు పోలీస్ వారి సూచనలు పాటించి ఎలాంటి అవాంతరం లేకుండా గణేష్ నిమజ్జనం చేసుకోవలసిందిగా ఈ సందర్భంగా కొరడమైనది.
ఈ యొక్క కార్యక్రమంలో డీఎస్పీ మల్లరెడ్డి ,సి.ఐ రవికుమార్,ఎస్.ఐ శంకరరావు లు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...