నాలుగు రాష్ట్రాలతోపాటు నిర్వహించాలంటే…!

జమిలి ఎన్నికలైతే పార్లమెంటుతోపాటే తెలంగాణ అసెంబ్లీకి జరిగేవని, ఏప్రిల్ 2019లో అవి జరగాల్సి ఉందన్నారు. కానీ, ఇప్పుడు ఆ వాదనకు అవకాశం లేదని తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు తగిన ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంటుందన్నారు.

ముందస్తుపై ఈసీ స్పష్టత చట్టంఈ విషయంపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనా లేదని, దీనిపై 2002లో రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరగా.. అసెంబ్లీ రద్దయినప్పుడు ఎన్నికలు త్వరగా జరపాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందని తెలిపారు. ఎందుకంటే… అబద్ధర్మ ప్రభుత్వానికి ఆయాచిత ప్రయోజనం పొందేలా ఆరు నెలలపాటు అధికారంలో ఉండకూడదని సూచించిందని వివరించారు.

జోస్యంతో సంబంధం లేదు.. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని ఓపీ రావతి తెలిపారు. నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయని ఎవరో జోస్యం చెబితే ఎన్నికల సంఘానికి సంబంధం లేదని ఓపీ రావత్ అన్నారు.

Please follow and like us:

You may also like...