నాన్ బెయిలబులు వారంట్లు ఇవ్వడమేంటి…సోమిరెడ్డి?

నెల్లూరు: జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బాబ్లి ప్రాజెక్ట్ ఎత్తు పెంచడాన్ని నిరసిస్తూ ఎనిమిదేళ్ల క్రితం ఆందోళన చేసిన సీఎం చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తూ నోటీసులు ఇచ్చారు.బాబ్లి ప్రాజెక్ట్ ఎత్తు పెంచితే తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్,జగిత్యాల,కరింనగర్,సిరిసిల్ల, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయని ఐదు రోజుల పాటు నిద్రాహారాలు మాని మా నాయకులు పోరాడారు.పోలీసులు అరెస్ట్ చేస్తే ఐదు రోజులు తర్వాత బెయిల్ పై వచ్చారు.ఇప్పుడు ముందస్తు నోటీసులు ఏమి ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇవ్వడం దారుణం.ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎనిమిదేళ్ల క్రితం కేసుకు నోటీస్ ఇస్తారా.మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోడీ కలిసి చేస్తున్న కుట్ర ఇది.తెలంగాణలో మహాకూటమిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.మోదీతో పాటు ఆయనతో కలిసి కుట్రలు చేస్తున్న వారికి ప్రజలు షాక్ ఇవ్వడం ఖాయం.మీ రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకుంటున్నారు.బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే కేసీఆర్ అడ్డుకోలేకపోయాడు.రాహుల్ గాంధీతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది నేతలకు మోడీ నోటీసులు ఇస్తున్నారు.రోజూ అవినీతి గురించి మాట్లాడే మోదీ కర్ణాటక ఎన్నికల్లో 6 వేల కోట్లు ఖర్చు పెట్టారని సీఎంఎస్ సర్వేనే చెప్పింది.

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సాక్షాత్తు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్పతో పాటు గాలి జనార్దన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బహిర్గతమయ్యాయి.అభివృద్ధికి కేరాఫ్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోతోంది, తట్టుకోలేకే మోడీ ఇలా వ్యవహరిస్తున్నారు..దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకులను అణగదొక్కడమే మోదీ ప్రధాన అజెండాగా మారింది..

మోదీ పద్ధతి మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా ప్రజలు తిరగబడుతారు.రేపు సాయంత్రం నెల్లూరులో అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం..24 గంటల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కేసును వాపసు తీసుకోవాలి, లేకుంటే ప్రజల ఆగ్రహం తప్పదని, ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.

Please follow and like us:

You may also like...