నష్టం జరిగితేనే హడావిడి…!

  • పదుల సంఖ్యలో ప్రమాదాలు
  • ఓ లారీ దుర్ఘటనలో ఏమీ మిగలలేదు…
  • మరో లారీ ఘటన లో గాయాల పాలైన ఓ డ్రైవర్, మరో డ్రైవర్ మృతి.

జగిత్యాల/మల్యాల/నూకపెల్లి : జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్లే దారిలో గల నూకపెళ్లి వరుద కాలువపై పెద్ద గుంతలు పడి ఇప్పటివరకు చాలా మంది చనిపోయారు.గుంతలు మొదట ఏర్పడిన తరువాత పై పై ప్యాచులు వేసి గాలికొదిలేస్తున్నారు.ఆ తదనంతరం వాహనాల రద్దీ వల్ల ఆ ప్యాచ్ వర్క్ పనులు మళ్లీ మొదటికి వస్తున్నాయి. మళ్ళీ అదే తంతు. ఇలాగ చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రమాదాలు నెలకొన్న సమయం లో రాజకీయ నాయకులు, అధికారులు హడావుడి చేయడం ఆ సమయం లో అధిక నష్టం వాటిల్లితే ఇక అక్కడ జాతరే, కానీ ప్రమాదం లో నష్ట పోయిన కుటుంబాలకు చెందాల్సిన ఆర్ధిక సహాయం నెలల తరబడి కార్యాలయాల చుట్టు తిరిగితే కాని పరిహారం పొందని దుస్థితి.ఓట్ల సమయం లో తప్పితే, మల్లి సంఘటన జరిగినప్పుడు ఆ తదనంతరం పట్టించుకోని నాయకులు. చోద్యం చూస్తున్న అధికారులు, పట్టించుకోని ప్రయాణికుల ప్రాణాలు. కాపాడవలసినదిగా అర్థిస్తున్న జగిత్యాల కరింనగర్ రహదారి బాధిత కుటుంబాలు మరియు ప్రయాణిస్తున్న ప్రయాణీకులు.

Please follow and like us:

You may also like...