నల్ల బంగారం సంస్థకు అంతర్జాతీయ అవార్డు….

హైదరాబాద్/రామగుండం : సింగరేణి సంస్థకు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ సంస్థగా సింగరేణికి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బ్యాంకాక్‌లో జరిగే ఓ కార్యక్రమంలో సింగరేణి సంస్థ ఎండి ఈ అవార్డును అందుకోనున్నారు. సింగరేణికి అంతర్జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ సిఎం కెసిఆర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సింగరేణి కార్మికులకు అభినందనలు తెలిపారు.

Please follow and like us:

You may also like...