నల్గొండ సభలో చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు,జానా పై నిప్పులు చెరిగిన కేసీఆర్….!

హైదరాబాదు / నల్గొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నల్గొండలో ప్రజా ఆశీర్వాద సభలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు గతంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని, కానీ తనకు జరుగుతున్నదని,జరుగబోయే తీరు గురించి ముందే స్నేహితుడు అసదుద్దీన్ ఓవైసీ ఫోన్ చేసి కుట్ర కు సంభందించిన అన్నీ పూర్వాపరాలు  చెప్పారని దానితో ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ కోసం మీరొక్కరే పోరాడారని, ఇప్పుడు కలిసి పోరాడుదామని తనకు అసదుద్దీన్ ధైర్యం చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్న కుట్రదారున్ని చంద్రబాబును ఇక్కడకు తీసుకు వస్తారా అని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇటీవల ఓ సర్వేలో తెరాస అద్భుత విజయం సాధిస్తుందని తేలిందని చెప్పారు.

110 స్థానాల్లో తెరాస గెలుపు తనకు తాజాగా ఓ సర్వే రిపోర్ట్ వచ్చిందని, 119 నియోజకవర్గాల్లో 7 సీట్లు మజ్లిస్ పార్టీకి పోతే, విపక్షాలు రెండు స్థానాల్లో మాత్రమే గెలుస్తాయని, 110 స్థానాల్లో తెరాసనే గెలుస్తుందని తేలిందని చెప్పారు. ఎన్నికలు ఎందుకు వచ్చాయో తాను ఇప్పటికే చెప్పానని తెలిపారు. ప్రజల సహకారంతో 2001 ఎగిరిన గులాబీ జెండా ముందుకు సాగుతోందన్నారు. తాను తెలంగాణను ఎత్తుకున్నప్పుడు అవమానాలు, విమర్శలు ఎదురయ్యాయని చెప్పారు. అవమానాలు, విమర్శలు ఎదుర్కొని, ఎత్తిన జెండా దించకుండా ముందుకు సాగామన్నారు. నల్లగొండ జిల్లాతో తనకు ఓ ఉద్వేగభరిత సంబంధం ఉందని చెప్పారు. తెరాసను నల్గొండ గెలిపించిందని చెప్పారు.

కాంగ్రెస్ నేతలకు లాగులు తడుసుడే యిగ….!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబుకు గులాములు అయితే, కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములు అని కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. ఢిల్లీని చూస్తే కాంగ్రెస్ పార్టీకి లాగులు తడుస్తాయన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు వేశారన్నారు. డిజైన్లలో లోపం ఉంటే అసెంబ్లీలో చెప్పాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణకు శాపం అన్నారు. దక్షిణ తెలంగాణలో ఒక్క విద్యుత్ శక్తి ప్రాజెక్టు లేదన్నకెసిఆర్ ఇది అబద్దమైతే ఒక్క ఓటు వేయకుండా ఓడగొట్టాలని సవాల్ చేశారు.

పెద్దపెద్ద మాటలు మాట్లాడే చెత్త నాయకులు అందరూ నల్గొండ జిల్లాలోనే ఉన్నారని కేసీఆర్ విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదని, ఆయనను చూస్తే జాలి వేస్తోందని వ్యగ్యం గా మాట్లాడుతూనే చురకలంటించారు. తెలంగాణకు మొదటి నుంచి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. జానారెడ్డి పార్టీ పెడితే మంత్రి పదవి కోసమే పెట్టారని తాను చేరలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న జానారెడ్డి జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ వన్ పోలీస్‌గా రూపుదిద్దుకుంటోందన్నారు. ఒక్కో రంగంలో ఊహించని మార్పులు వస్తుంటే, కాంగ్రెస్ పార్టీవి పనికిమాలిన ఆలోచనలు అన్నారు.

Please follow and like us:

You may also like...