నందమూరి కారు బోల్తా…దుర్మరణం.!

నందమూరి హరికృష్ణ మృతి….

రోడ్డు ప్రమాదం లో దుర్మరణం…

హైదరాబాద్ నుండి నెల్లూరికి వెళ్తున్న సమయం లో దుర్ఘటన…

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు….ట్వీట్ లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం…..

రాజ్యసభలో తెలుగులో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు ధ్వజమెత్తిన ఎన్టీఆర్ వారసుడు…
తెలుగు కోసం రాజ్యసభ సభ్యత్వం వదిలేసుకున్న వాడు నందమూరి హరికృష్ణ.
దురదృష్టం తెలుగు భాషా దినోత్సవం నాడే ఈ దారుణం జరగడం.

హైదరాబాదు/నార్కట్పల్లి: రాజకీయ రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది.హైదరాబాద్‌ నుంచి  నెల్లూరు  వస్తుండగా డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో ఆయన కన్నుమూశారని ధ్రువీకరించారు.

ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.అయితే, ప్రమాద స్థలంలో రెండు వాహనాలు ఉండడం.. హరికృష్ణ రోడ్డుపై పడిపోవడంతో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి పల్టీ కొట్టిందా..? లేక ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టిందా..? వేరే వాహనం రాంగ్‌రూట్‌లో వచ్చి ఎదురుగా ఢీకొట్టిందా..? అసలు ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా..? లేదా..? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సమాచారం తెలుసుకును పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి అయింది. ఇప్పడు హరికృష్ణకు కూడా అదే జిల్లాలో ప్రమాదం జరిగింది. ఈ విషయం నందమూరి అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది..నల్గొండ జిల్లా నందమూరి కుటుంబానికి శాపంగా మారిందని పలువురు అభిమానులు బాధా తప్ప హృదయంతో విలపిస్తున్నారు..

తెదేపా సీనియర్‌ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆయన తనయులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు. తండ్రి భౌతికకాయం చూసి ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు బోరున విలపించారు. హరికృష్ణ తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. హరికృష్ణ మృతి వార్త తెలిసిన వెంటనే పెద్దసంఖ్యలో తెదేపా నేతలు, నందమూరి అభిమానులు ఆస్పత్రికి తరలివస్తున్నారు.

Please follow and like us:

You may also like...