దోమల నివారణకు తగు చర్యలు…

  • జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి వెల్లడి..

కర్నూలు జిల్లా/ఎమ్మిగనూరు/శేషాద్రి గౌడ్:దోమల నుండి వచ్చిన వ్యాధులకు వచ్చిన తరువాత తీసుకునే జాగ్రత్తలు కన్నా,ముందుగానే దోమలపై అవగాహన కల్పించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.మున్సిపల్ కార్యాలయం నుండి విద్యార్థులు, అంగన్వాడి వర్కర్లు, ఉపాధ్యాయులు మున్సిపల్ సిబ్బంది దోమలపై దండయాత్ర అనే నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధులగుండా తిరిగారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దోమలు మలేరియా, డెంగూ, చికున్ గున్యా, మెదడు వాపు వ్యాధి వంటి భయంకరమైన వ్యాధులను వ్యాప్తిచేస్తాయన్నారు. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,మురికి కాలువల్లో చెత్తా చెదారములు వేయకుండా నీరు సాఫీగా పోవునట్లు చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, డిఇ వెంకటేశ్వర్లు, ఎంఈవో అంపయ్య, అంగన్వాడి కార్యకర్తలు,విద్యార్థులు,మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...