దర్శకుడు రాఘవేంద్రరావుకు తప్పిన ప్రమాదం…!

తిరుమల ఘాట్ రోడ్డులో కారు కు ప్రమాదం…

తిరుమల: ప్రముఖ దర్శకుడు,ఎస్వీబీసీ చైర్మన్  రాఘవేంద్ర రావు కారుకు ప్రమాదం జరిగింది.  సాయంత్రం ఆయన తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్‌ రోడ్డులో కారు అదుపుతప్పి పిట్ట గోడను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాఘవేంద్రరావు వ్యక్తిగత సహాయ సిబ్బంది మురళి, సుమన్‌, కారు డ్రైవర్‌ బాలాజీకి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ బాలాజీని ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ప్రమాద సమయంలో రాఘవేంద్రరావు మరో కారులో తిరుమలకు వెళ్తున్నారు.

Please follow and like us:

You may also like...