తెలంగాణ ప్రవాస కార్మికుల కోసం డాక్టర్ రఘు….

దుబాయ్ / మెట్ పల్లి : ఉన్న ఊర్లో పని లేక,వాతావరణం అనుకూలించక, ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లభించక పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ బాట పట్టి అక్కడ వాతావణం సహకరించక సరైన ఉపాధి దొరక్క కొందరు బలై పోతూ ఉంటే మరికొందరు ఏజంట్ల ధన దాహానికి మోసపోతున్న వారు కొందరు,ఇలా గల్ఫ్ బాటలో నానా అగచాట్లు పడుతూ, కన్నా వారికోసం కొందరు,అప్పు చేసి వచ్చి కుటుంబ భారం మోయడానికోసం మరికొందరు ఇండ్లకు ఏండ్లు గల్ఫ్ లో నే మగ్గుతున్నారు.గల్ఫ్ ప్రభుత్వాల చట్టాల మీద అవగాహన లేక భాషా పరిజ్ఞానం లేక వచ్చి రాణి భాష తో తంటాలు పడుతూ కాలం ఎల్లతీసుకుంటున్న ప్రవాస కార్మికుల బాధలు వర్ణనాతీతం.ఇదిలా ఉండగా ఇక్కడి మన దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు సరిగా లేక ఎన్నికల వేళ చెబుతున్న మాటలు వట్టి నీటి మూటల్లా తాయారు అవుతున్నాయి.ఈ నేపధ్యం లో కోరుట్ల నియోజకవర్గానికి చెందిన సామాజిక వేత్త వైద్యులు డాక్టర్ రఘు మన ఉత్తర తెలంగాణా నుండి గల్ఫ్ బాటలో ఎక్కువ మొత్తం లో వలసలు ఉంటాయని అందులో ఎందరో వారి వారి పరిస్ధితుల ప్రభావాలను బట్టి కంపెనీ లో సరియన పని లేకో,జీతాలు సరిగ్గా అండకో,ఒక్కోసారి పనులు లేకో ఇతర కంపెనీల వైపు మొగ్గు చూపి కళ్లి వెళ్లి అయినా వారెందరో ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్నారై సెల్ కన్వీనరు నంగి దేవేందర్ రెడ్డి ద్వారా తెలుసుకున్న డాక్టరు రఘు మనసు చలించి నేనున్నాను అంటూ దుబాయ్ కి పయనం అయినారు.

యుఏఇ ఆమ్నెస్టీ(ఆగస్టు 1నుండి ఆక్టోబర్ 31వరకు)ఈ నేపధ్యం లో డాక్టర్ రఘు మాట్లాడుతూ యుఏఇ ప్రభుత్వం ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మన కల్లవిల్లిలో ఉన్న తెలంగాణ సోదరులు వినియోగించుకోవాలని, తనవంతుగా అవసరమున్నవాళ్లకు టికెట్ రూపంలో గాని ఇంకేవిధంగా గాని సహాయం చేస్తానని, ఆవరమైతే కొన్ని రోజులపాటు ఇక్కడే దుబాయ్లో దగ్గరుండి మన వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఎన్ ఆర్ ఐ పాలసీ అమలు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు, ఎన్ ఆర్ ఐ పాలసీ కోసం సంవత్సర కాలంగా పోరాడుతున్న “గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక” సభ్యులను అభినందిస్తూనే మా పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు,
అదే విధంగా ఇక్కడే నెలలపాటు ఉండి అమ్నెస్టీ లో తనవంతు కృషి చేస్తున్న నంగి దేవేందర్ రెడ్డి గారిని అభినందించారు మరియు కృతజ్ఞతలు తెలిపారు.
గల్ఫ్ దేశాలలో ఉన్న తెలంగాణ సంఘాల సహాయ కార్యక్రమాలను తెలుసుకోని వాళ్లందరికీ తన అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా గల్ఫ్ ప్రవాస కార్మికులను ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకున్న తమవంతు బాధ్యతగా ముందుకు వచ్చి సహకరిస్తున్న యూఏఈ లో ఉన్న సంఘాల ప్రతినిధులకు సభ్యులకు అలాగే కొన్ని రోజులుగా విదేశాల్లో తిరుగుతూ ఆపన్న హస్తం అందిస్తున్న నంగి దేవేందర్ రెడ్డి,డాక్టరు రఘులకు ప్రవాసీ మజ్దూర్ యూనియన్ నాయకుడు కడార్ల రంజిత్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు.

Please follow and like us:

You may also like...