తెలంగాణ కాంగ్రెస్ ఫ‌స్ట్ లిస్ట్‌…ఇదే!

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మొద‌టి ద‌శ అభ్య‌ర్థుల లిస్ట్‌తో ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. సుమారు 40 మంది అదిష్టానంతో చ‌ర్చించేందుకు వెళ్లారు. కొంద‌రు నేత‌లు ముందుగానే వెళ్ల‌గా.. ఇంకొంద‌రు టైమ్ చూసుకొని వెళ్తున్నారు. అయితే పొత్తుల‌తో పాటు తొలి జాబితా అభ్య‌ర్థుల లిస్ట్ కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. సుమారు 30-40 మందితో తొలి లిస్ట్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లుపెట్ట‌గా… కాంగ్రెస్ కూడా ఈ ప్ర‌క్రియ‌లో స్పీడ్ పెంచాల‌ని చూస్తోంది. అందుకే పెద్ద‌గా గొడ‌వ‌, అసంతృప్తుల ర‌గ‌డ లేని టిక్కెట్ల‌ను తొలి జాబితాలో ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించింది. అయితే ఆ లిస్ట్ ఈ విధంగా ఉండే అవ‌కాశం ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ ఫ‌స్ట్ లిస్ట్‌…!

1. ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి (హుజుర్‌న‌గ‌ర్‌)
2. జానారెడ్డి (నాగార్జున‌సాగ‌ర్‌)
3. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి (న‌ల్గొండ‌)
4. పొన్నాల ల‌క్ష్మ‌య్య (జ‌న‌గాం)
5. కామారెడ్డి (ష‌బ్బీర్ అలీ)
6. రేవంత్ రెడ్డి (కొడంగ‌ల్‌)
7. భ‌ట్టి విక్ర‌మార్క (మ‌ధిర‌)
8. సంప‌త్‌కుమార్ (ఆలంపూర్‌)
9. డీకే అరుణ (గ‌ద్వాల‌)
10. శ్రీధ‌ర్‌బాబు (మంథ‌ని)
11. వంశీచంద్‌రెడ్డి (క‌ల్వ‌కుర్తి)
12.జ‌గ్గారెడ్డి (సంగారెడ్డి)
13.సునీతా ల‌క్ష్మారెడ్డి (న‌ర్సాపూర్‌)
14. కూన శ్రీశైలం గౌడ్ (కుత్భుల్లాపూర్)
15. స‌బితా ఇంద్రారెడ్డి (మ‌హేశ్వ‌రం)
16. కార్తీక్‌రెడ్డి (రాజేంద్ర‌న‌గ‌ర్‌) (వీరిద్ద‌రి సీట్లు మార్చొచ్చు. ఒక‌రికొక‌రు)
17. సీత‌క్క (ములుగు)
18. గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి (భూపాల‌పల్లి)
19. జంగా రాఘవ‌రెడ్డి (పాల‌కుర్తి)
20. నాగం జ‌నార్ధ‌న్‌రెడ్డి (నాగ‌ర్ క‌ర్నూల్‌)
21.ఆరెప‌ల్లి మోహ‌న్ (మాన‌కొండూరు)
22. విజ‌య ర‌మ‌ణ‌రావు (పెద్ద‌ప‌ల్లి)
23. సోయం బాబూరావు (బోథ్‌)
24. ప్ర‌తాప్ రెడ్డి (గ‌జ్వేల్‌)
25. కొండేటి శ్రీధ‌ర్ (వ‌ర్ధ‌న్న‌పేట‌)
26. మ‌హేశ్వ‌ర్ రెడ్డి (నిర్మ‌ల్‌)
27. సుద‌ర్శ‌న్ రెడ్డి (బోధ‌న్‌)
28. విజ‌య రామ‌రావు (స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌)
29. ముఖేష్‌గౌడ్ (గోషామ‌హ‌ల్‌)
30. శ్రీశాంక్ (కంటోన్మెంట్‌)

Please follow and like us:

You may also like...