తెలంగాణలో ‘ముందస్తు’ జోరు.. వచ్చే నెలలో అసెంబ్లీ రద్దా….?

హైదరాబాదు : ఇటీవల మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఎక్కడా ముందస్తు అనే పదం వాడకున్నా ముందుగానే ఎన్నికలు వస్తాయనే సంకేతాలు ఇచ్చారు.

సెప్టెంబర్లోనే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ శ్రేణులు తెలంగాణ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరోవైపు టీ కాంగ్రెస్ కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. కేసీఆర్‌కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసురుతున్నారు.

దీంతో తెలంగాణలో ముందస్తు ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి.

ఈ వార్తల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముందస్తుకు సిద్ధపడుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తోంది.

వచ్చే నెలలో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడతామని ఉత్తమ్ చెప్పారు.

కేసీఆర్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత ఉందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
రాజకీయ పార్టీల అంచనాలు ఇలా ఉంటే.. ఎన్నికల సంఘం మాత్రం ముందస్తు ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది.

తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ ముందస్తు ఎన్నికల నిర్వహణ కుదరదని తేల్చి చెప్పారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయమే కీలకమని ఆయన చెప్పారు…..

Please follow and like us:

You may also like...