తెలంగాణలోనే మొదటిసారి మ్యానిఫెస్టో విడుదల చేసిన జీవన్.

జగిత్యాల : పట్టణం లో గల దేవిశ్రీ గార్డెన్ లో తెలంగాణ కాంగ్రెస్  పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్లెక్సీ ని జిల్లా కేంద్రంలో ఆవిష్కరించిన తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి…ఈ సందర్బంగా తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ పాత్రికేయ సోదరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో ఇతర పార్టీల కన్నా ముందు మ్యానిఫెస్టో ని ప్రజల ముందుంచి,కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అనిపించుకుందన్నారు.

ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరచిన అంశాలు…

2014 లో ఉద్యమ పార్టీగా ప్రజలు తెరాసకు పట్టం కట్టారు…
100 మంది ఎమ్మెల్యేలు,16 మంది ఎంపీల మద్దతు ఉంది…
కేంద్రం తో శక్యంగా ఉండి శాసనసభను రద్దు చేసుకోవడం కేసీఆర్ పాలన అసమర్థత నే…

కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు..ఎక్కడ అందించారో చెప్పాలన్నారు….

ఎల్లంపెల్లి నుండి నీరు పైకి పంపకపోవడం వలన నాలుగేళ్ళ లో ప్రాజెక్టుల రీ డిజైన్ చేయడం వల్ల లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోయింది…

కమీషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరత తీసుకొచ్చారు 15 వందల కోట్లతోనే ప్రతి గ్రామానికి ఫూరిఫైడ్ నీరు అందించవచ్చు కానీ 50 వేల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు…

తెరాస నాయకులు గ్రామాల్లో పరిశీలిస్తే తెలుస్తోంది. గ్రామాల్లో రోడ్లన్నీ నాశనంచేశారు.
గ్రామ పంచాయతీలో మీరు తిరిగే ప్రతి రోడ్డు మేము వేసిందే నాలుగేళ్లలో మీరు ఏదైనా పని చేస్తే నేను అడ్డుపడ్డాన చూపించండి…

జగిత్యాలకు నేను జేఎన్టీయూ,వ్యవసాయ యూనివర్సిటీ, బైపాస్ రోడ్డు, న్యాక్ సెంటర్ తీసుకొచ్చాను అని అన్నారు…

వచ్చే ఎన్నికల్లో మేము అధికారం లోకి వస్తే….

1)రైతాంగానికి రూ/ రెండు లక్షలవరకు ఏకకాలంలో బ్యాంక్ రుణమాఫీ తోపాటు వ్యవసాయ ఉత్పత్తి దారులకు గిట్టుబాటు ధర కల్పన చేయబడును…

2)58 సంవత్సరాలకే వృద్ద్యప్య పెంక్షన్ తోపాటు బీడీ కార్మికులకు వితంతువులకు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు నేత కార్మికులందరికి నెలకు 2000/పెంక్షన్ మరియు వికలాంగులకు 3000/పెంక్షన్..

3)నిరుపేదలు తెల్ల రేషన్ కార్డు దారులందరికి రూపాయికే కిలో సన్న బియ్యం తోపాటు గతంలో లాగా 9 రకముల నిత్యావసర వస్తువులు రాయితీతో మరియు దళిత కుటుంబాల వారందరికి ఉచితముగా ఇవ్వబడును…

4)అడబిడ్డలకు ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరానికి 6 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితముగా ఇవ్వబడును…

5)మహిళా సంఘాలకు బ్యాంకురుణ సౌకర్యాలపై ఉచితవడ్డి రాయితీ కల్పనలో పాటు సంఘానికి రూ/- లక్ష గ్రాంట్ ఉచితముగా ఇవ్వబడును…

6)రైతాంగానికి రైతుకూలీలకు తెల్ల రేషన్ కార్డు దారులందరికి ప్రతి కుటుంబానికి రూ/- 5 లక్షలు ప్రమాద బీమా…

7)ఇండ్లు లేని నిరుపేదలందరికి ప్రభుత్వ స్థలాలతోపాటు ప్రభుత్వ స్థలాలు అందుబాటు లేనిచోటకుడా వారి స్వంత స్థలంలోరూ/-5లక్షలలు రాయితీ తో ఇండ్ల నిర్మాణం కార్యక్రమము మరియు గతములో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ సముదాయములో 2లక్షలతో అదనపు గది నిర్మాణము పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఉంటాయని గుర్తు చేశారు..

8)దళిత (ఎస్సీ&ఎస్టీ) కుటుంబాల వారందరికీ 200యూనిట్లవరకు గృహ విద్యుత్ వినియోగం ఉచితముగా ఇవ్వబడును..

9)నిరుద్యోగ యూవతకు నెలకు 3000/-నిరుద్యోగ భృతి ఇవ్వబడును

10)ప్రభుత్వ ఉద్యోగులకు సి.పీ.ఎస్ స్తానే ఓ.పీ.ఎస్.  విధానం అమలు

11)గల్ఫ్ ఎన్నారై మృతులకు ప్రభుత్వ పరంగా రూ/- 5లక్షలు సహాయం

12)గ్రామపంచాయతీ లో పనిచేసే పారిశుధ్య కార్మికులు తాత్కాలిక ఉద్యోగులకు క్రమబద్దీకరణ తో పాటు నెలకు రూ/-10000 వేలు ప్రభుత్వ పరంగా చెల్లింపులు ఉంటాయని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Please follow and like us:

You may also like...