తప్పిదం మాదే ఎంపీ వినోద్ కుమార్…!

  • అనాలోచిత చర్యలు…
  • రైతు బందులో క్షతగాత్రులు ఎవరు ఉన్నారు?
  • ఆర్ ఎం కు బాధ్యత లేదా?
  • గతం లో ఘాటు ప్రమాదం నేర్పిన పాఠం ఇదేనా?
  • నాలుగేళ్లలో కొండగట్టు దేవాలయం గుర్తుకు రాలేదా?

జగిత్యాల/కొండగట్టు:నిన్న కొండగట్టు ఘాటు వద్ద లోయలో పడ్డ బస్సు ప్రమాదం అధికారుల వైఫల్యం తో పాటు మా తెరాస ప్రభుత్వానిదే అని అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమే అని,ఎప్పుడన్నా పాల్గొంటే ఒక శవ యాత్రలో పాల్గొన్నానని కానీ నిన్న జరిగిన సంఘటన వల్ల 57 కుటుంబాల శవ యాత్రను చూడాల్సిన దుస్థితి ఎదురయ్యింది అని అన్నారు.

వైద్యం కోసం మోసుకెళ్తున్న సేవకులు..

ఎంపీ తో ప్రెస్ మీట్ లో కరింనగర్ మరియు హైదరాబాదులో చేర్చిన బాధితుల వద్ద డబ్బుల సమస్య వస్తుందని ఓ విలేకరి ప్రశ్నించారు.దానికి సమాధానం ఇచ్చిన ఎంపీ ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుందని అన్నారు.కానీ నిన్న రాత్రి నుండి కరింనగర్ లో దీనికి భిన్నంగా ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం డబ్బులు చెల్లింపు లేనిదే వైద్యం అందించే పరిస్థితి లేకపోవడం తో స్థానిక భాజపా నేత బండి సంజయ్ రాత్రి నుండి ఆసుపత్రుల ను సందర్శించి డబ్బులు కట్టి యాజమాన్యం తో మాట్లాడటం తో క్షతగాత్రుల కుటుంబ సభ్యులు బండి కి చేతులెత్తి దండలు పెట్టడం,ఈ విషయం ఈ నోటా ఆ నోటా బయటకు పొక్కడం తో తెరాస పార్టీలో వణుకు మొదలయ్యింది.

ఇదంతా ఓ వైపు ఉంటే ఎంపీ వినోద్ అనాలోచిత చర్యల వల్ల ప్రమాదం జరిగిందని.జరిగిన సంఘటన తరువాత తప్పు ఒప్పుకోక పొతే బాగుండదు అని అన్నారు .ఘాట్ రోడ్డు ప్రమాదం కు కారణం అయిన ఆర్టీసీ కి చెందిన 4 గురు సిబ్బంది ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం ఘాట్ రోడ్డు ప్రయాణం నిషేదాజ్ఞలు అమలులోకి తెచ్చామని అనడం తో ఓ విలేకరి మాట్లాడుతూ గతం లో కూడా ప్రభుత్వాలు నిషేధం లోకి తెచ్చారని అయినా దుర్ఘటన జరిగిందనడం తో మా గౌరవ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తో మాట్లాడి రోడ్ సేఫ్టీ అథారిటీ ఉన్నతాధికారి అయిన కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ కు బాధ్యతలు అప్పగించారని తెలిపినారు.వారు తక్షణమే దీనిపై సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు అన్నారు.

చివరగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు వర్తింప చేయడం కోసం మా వ్యవసాయ విభాగం వారు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

Please follow and like us:

You may also like...