టీఆర్ నగర్ లో కార్డాన్ సర్చ్….!

జగిత్యాల/టీఆర్ నగర్ : ఈరోజు జిల్లా ఎస్పీ సింధు శర్మ(ఐ.పి.యస్) ఆద్వర్యంలో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని తారకరామ నగర్ లో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ ప్రజల పరిరక్షణ గురించి ప్రజలకు భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే ఉద్దేశ్యం గురించి కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు.

మరియు ఎలాంటి పేపర్లు లేని మోటార్ సైకిల్స్-(36), ఆటోలు-(10) కార్లు (04),ట్రాక్టర్లు(05) మొత్తం (53) వాహనాలు సీజ్ చేసినారు. మరియు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు,ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపినారు. పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని డాక్యుమెంట్స్ లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని తెలిపినారు.

ఈ రోజు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు వాటికి సంబంధించిన పత్రాలు చూపించిన తర్వాత తిరిగి వారి వాహనాలను వారికే అప్పగించడం జరుగుతుందని, కాలనీలో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు. మేము ఖాకీ యూనిఫామ్ ధరించి విధులు నిర్వర్తించేది ప్రజలను రక్షించడానికే అని అన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపినారు.కార్డాన్ అండ్ సెర్చ్ లు తరుచుగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ యొక్క కార్డెన్ సెర్చ్ సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటరమణ గారు ,సిఐలు రాజేష్ ,ప్రకాష్ గారు, రూరల్ ఎస్ఐ సతీష్ గారు వివిధ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ లు ,ఇద్దరు ఏ.ఎస్ఐ లు, 4 హెడ్ కానిస్టేబుల్, 24 మంది కానిస్టేబుల్ లు డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...