టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ర్యాలీ…

రంగారెడ్డి: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవుపల్లిలో స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎప్ నాయకుడు శ్రీశైలంరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మైలార్‌దేవుపల్లి నుంచి ఆరె మైసమ్మ టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఈ సందకర్భంగా కొందరు కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా… ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా ట్రాఫిక్ మాత్రం పెద్దఎత్తున జామ్ అయింది.

Please follow and like us:

You may also like...