టీఆర్ఎస్‌కు రాం…రాం…బాబూమోహన్!

  • కారు దిగి కమలం తో జత కట్టడానికి తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
  • కమలం గుర్తు మీద నిలబడి గట్టి పోటి కి సిద్దం అంటున్న తాజా మాజీ.
  • ఆందోల్ లో కమలం వికసించేనా?

టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్ బీజేపీలో చేరనున్నారు. ఇందుకోసం శనివారం ఆయన తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా బాబూ మోహన్  టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. 14లో ఆయన ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల 105 మందితో టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్.. బాబూ మోహన్‌‌కు జాబితాలో చోటు కల్పించలేదు. బాబూ మోహన్ స్థానంలో జర్నలిస్ట్ క్రాంతికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. స్థానికుడు కాకపోవడం, హరీశ్ రావుతో సత్సంబంధాలు లేకపోవడం, నోటి దురుసు బాబూ మోహన్‌కు ప్రతికూలంగా మారింది. టికెట్ దక్కకపోవడంతో బాబూ మోహన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆందోల్ నుంచి మళ్లీ ఎలాగైనా పోటీ చేయాలనే కృత నిశ్చయంతో ఉన్న ఆయన పార్టీ మారడానికి సిద్ధపడుతున్నారు.

Please follow and like us:

You may also like...