జీవీకే ఈఎంఆర్ఐ సంస్థలో ఉద్యోగావకాశాలు….

కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాంగణంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీటింగ్ హాల్ లో ఇంటర్వ్యూలు….

హైదరాబాదు : జీ.వీ.కే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108,అంబులెన్స్ సర్వీసుల్లో పనిచేయుటకు డ్రైవర్స్ మరియు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖస్తులు స్వీకరించబడును
తేదీ ఈ నెల 19 శనివారం రోజున కరీంనగర్లోని ఎస్ ఆర్ ఆర్ కాలేజీ ప్రాంగణంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీటింగ్ హాల్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంనట్లు..108 అంబులెన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పొగ్రాం మేనేజర్ బాలకృష్ణ తెలిపారు. …డ్రైవర్స్ (పైలట్లు) పోస్టులకు 10వ తరగతి ఉతీర్ణత మరియు డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జ్ నంబర్, కనీసం మూడు సంవత్సరాలు డ్రైవింగ్ లో అనుభవం కలిగి ఉండాలి. వయసు 22-35 సంవత్సరాల లోపు ఉండాలి. ఎత్తు 5.4 అంగుళాలు ఉండాలి.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టుకు ఢిగ్రీ లైఫ్ సైన్సెస్,మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్,మరియు సైన్స్ బ్యాక్ గ్రౌండ్ లో డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి.వయసు 30 సంవత్సరాల లోపు,ఎత్తు 5.4 అంగుళాలు ఉండాలి. ఈ సదవకాశాన్ని నిరుద్యోగులందరూ వినియోగించుకోగలరు.ఇంటర్వ్యూ కు హాజరయ్యే అభ్యర్థులు అందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రాగలరు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్…
7330965937/7995061601/7659931108Please follow and like us:

You may also like...