జిల్లా మహా సదస్సు తో ఉద్యోగ జేఏసీ కి సంబంధం లేదు టీ ఉద్యోగ ఐ కా స జిల్లా చైర్మన్ భోగ శశిధర్

తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ జెసి పేరుతో కరీంనగర్ లో ఈనెల 6న శనివారం నిర్వహిస్తున్న మహా సదస్సుకు తెలంగాణ ఉద్యోగుల ఉపాధ్యాయుల గెజిటెడ్ అధికారుల పెన్షనర్ల ఐక్య కార్య చరణ సమితికి ఎలాంటి సంబంధం లేదని జగిత్యాల జిల్లా టీ ఉద్యోగ జేఏసీ చైర్మన్ భోగ శశిధర్ గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కో చైర్మన్ ఎండి వకీలు స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర టీ ఉద్యోగ జెసి చైర్మన్ కారం రవీందర్రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా టిఎన్జీవోల భవనంలో సంఘ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారే మళ్లీ కొన్ని రాజకీయ పార్టీల ప్రలోభాలకు ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమనిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అపద్ధర్మ ప్రభుత్వానికి తమ టీ ఉద్యోగ ఐ కా స రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేసిన విజ్ఞప్తి మేరకు ఎన్నికలు ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతితో గవర్నర్ ఆమోదించడంతో ఉద్యోగుల సమస్యల పరిష్కార ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సంఘ జిల్లా కార్యదర్శి ఆకుల సత్యం. టి రెవిన్యూ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి చేలుకల కృష్ణ, టి టి యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నునవత్ రాజు, ఉదయగిరి జమునా రాణి, రెవెన్యూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పీసీ హనుమంత్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రావు, తెలంగాణ పెన్షనర్ల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్ ,టింగో జిల్లా అధ్యక్షుడు జి ఎస్ ఆర్ విజేందర్ ,తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...