జిల్లాకు పెట్రోలింగ్ వాహనాలు…ఎస్పీ సింధు శర్మ!

  • పెట్రోలింగ్ వాహనాలకు జండా ఊపిన ఎస్పీ…
  • జిల్లాకు 20 ఫోర్ వీలర్స్ వాహనాలు మరియు 114 ద్విచక్ర వాహనాలు..
  • 100 డయల్ ను సద్వినియోగం చేసుకోవాలన్న ఎస్పీ…

జగిత్యాల జిల్లా…. 
జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు ముందుంటారని జిల్లా ఎస్పీ శ్రీమతి శ్రీ సింధు శర్మ అన్నారు. జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన నాలుగు పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి  పోలీస్ శాఖ ను మరింత పటిష్ట పరిచే చర్యలు చేపట్టారని అన్నారు. జిల్లాకు మొత్తo 20 ఫోర్ వీలర్ వాహనాలు,114 ద్విచక్ర వాహనాలు మంజూరయ్యాయన్నారు.
మొదటి విడతగా నాలుగు మంజూరు చేశారని ఈ వాహనాలని జిల్లాలో ఉన్న జగిత్యాల టౌన్, ధర్మపురి, కోరుట్ల ,మెట్పల్లి నాలుగు సర్కిళ్ల పోలీస్ స్టేషన్ లకు పంపుతున్నట్లు తెలిపారు. మరియు 114 మోటార్ సైకిళ్ళు ల ను అని పోలీస్ స్టేషన్ ల కు పంపిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, డయల్ 100 లో ఫిర్యాదు అందిన వెంటనే ప్రతిస్పందించి సమస్య ఉన్న ప్రాంతానికి అత్యంత త్వరగా చేరుకొని సమస్యను పరిష్కరించడానికి ఈ వాహనాలను ఉపయోగిస్తామని తెలిపారు. ఈ యొక్క వాహనాలు 24 గంటల పాటు ప్రజలకు సేవలు అందిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డి ఎస్ పి ప్రతాప్ , మెట్పల్లి, జగిత్యాల డిఎస్పీలు మల్లారెడ్డి ,వెంకటరమణ  ,ఆర్ ఐలు నవీన్, రామారావు,సీఐ లు పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ వాహన చోదకులు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...