Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

జాతీయ మహాసభల గోడ ప్రతిని ఆవిష్కరించిన నంద్యాల శాఖ

కర్నూలు జిల్లా…
మహానంది..
ఈరోజు టీవీ న్యూస్:
మోడి నిరంకుశ పాలనకు చరమగీతం పాడుదాం…. మోడి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిల్సిన అవసరం ఆసన్నమైందన్నారు ఈనెల 27 నుండి డిసెంబర్ 1వరకు సీపీఐ ఎంఎల్  రెడ్ స్టార్ పార్టి 11వ జాతీయ మహాసభలు బెంగళూరు లోని సావద్దాన్ లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని గోడపత్రికలను నంద్యాల లో విడుదల చేసారు. అనంతరం జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ మాట్లాడుతు మోడి నిరంకుశ పాలన వల్ల దేశ ప్రజల్లో వ్యతిరేఖత మెదలైందని వచ్చే ఎన్నికల్లో ప్రజలే  భాజపా  పాలనకు బుద్ధి చెబుతారని అన్నారు. కేంద్ర  ప్రభుత్వం అధికారం  చేపట్టిన  తర్వాత ఇచ్చిన హామీలు  ఏ  ఒక్కటి నెరవెర్చలేదన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం పెద్ద నోట్లు రద్దు చేయడంతో కార్పోరేట్ శక్తులు ఇందులో లాభపడ్డాయని వారు ఆరోపించారు. పెద్ద నోట్లు రద్దు చేసి నల్లధనం వెలికి తీసి ప్రతి కుటుంబానికి15 లక్షల రూపాయలు జమ చేస్తామన్న ప్రధాన మంత్రి నరెంద్రమోడి హామీ ఎమైందన్ని వారు ప్రశ్నించారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు బ్యాంకు లో జీరో అకౌంట్ లు చేయించి కోట్లాది మంది బ్యాంకు లో ఖాతాలు తెరిచారని రెండేళ్లు గడిచిన జీరో అకౌంట్ లు వారిని వెక్కిరిస్తూన్నాయని వారన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడి, లలిత్ మోడీ లాంటి కార్పోరేట్లు వేళాది కోట్ల రూపాయలు పంగనామాలు పెట్టి విదేశాలకు పారిపోవడానికి భాజపా ప్రభుత్వం దొడ్డిదారి తెరించిందని పెద్ద నోట్ల రద్దు తో ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిందన్నారు పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రించడంలో కేంద్రం విఫలమైందన్నారు  జీఎస్టీ  వల్ల సామాన్యులకు సైతం భారం పెరిగిందని రాబోయే ఎన్నికల్లో భాజపా కి చమరగీతం పాడాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, పాములేటి, నరసింహుడు, రాజు, దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:

You may also like...