జగిత్యాలలో విద్యార్థుల మృతి అనుమానస్పదం…!

 • దర్యాప్తు కొనసాగింపు జగిత్యాల డిఎస్పి వెంకటరమణ…
 • మైనర్లకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు…
 • కొంపలు ముంచుతున్న స్మార్ట్ ఫోన్లు….
 • ఫెస్బుక్,వాట్సప్ లకు అడిక్ట్…
 • కొరవడిన తల్లిదండ్రుల నిఘా… 
 • సినిమాల ప్రభావం అంటా ఇంతా కాదు… 

జగిత్యాల పట్టణంలో పదవ తరగతి చదువుతున్న ఇరువురు విద్యార్థులు పెట్రోల్ మంటలతో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకోగా, ఈ సందర్భంగా టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డి.ఎస్.పి వెంకటరమణ వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో మహేందర్, రవితేజ లు పదో తరగతి చదువుతున్నారు. అయితే వీరికి అదే పాఠశాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం సాగుతుంది. ఈ క్రమంలో ఒకరికొకరు ఫోన్ లో తరచుగా చాటింగ్ చేసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా భవిష్యత్తులో తమ ప్రేమ వ్యవహారంలో కుటుంబ సభ్యులు ఒప్పుకోరని భావించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల వచ్చిన ఆర్ ఎక్స్100 సినిమా లో ఉన్న దృశ్యాల ప్రభావితం తో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తుందని డిఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం స్థానిక పెట్రోల్ పంపు లో పెట్రోలు కొనుక్కుని మిషన్ కంపౌండ్ ప్రాంతంలోకి చేరుకున్నారు. అప్పటికే వారిద్దరూ మద్యం సేవించి ఉండి ఉంటారని ఆ మత్తులో అనంతరం వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుకుని తర్వాత పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అన్నారు. మంటల్లో కాలుతున్న ఇరువురిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా 80 శాతానికి పైగా కాలిన శరీరంతో మహేందర్ మృతిచెందాడు. అదే సంఘటనలో గాయాల పాలైన రవితేజను చికిత్సకై కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. రవితేజకు మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఉందని,కొంతమంది మైనర్లు మత్తు పదార్థాలను సేవిస్తున్నారని పోలీస్ లకు సమాచారం అందిన మేరకు గతంలో కొంతమంది మైనర్ లను అదుపులోకి తీసుకున్న వారిలో రవితేజ ఉన్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని వీరిద్దరి ప్రేమ విషయం తెలిసిన వారిని విచారించి నిజ, నిర్ధారణలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట జగిత్యాల టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ ప్రకాష్ ఉన్నారు

రమేష్ కుమార్, కథలాపూర్,సామాజిక వేత్త
 • రమేష్ కుమార్, కథలాపూర్, జగిత్యాల జిల్లా.. 
 • మైనర్లకు మద్యం అమ్మకాలు కూడా కారణమే…. ఓ వైపు సినిమాల ప్రభావితం ఎక్కువగా ఉండటం…మరో వైపు విచ్చల విడిగా మద్యం అమ్మకాలు ఆ రెండు కుటుంబాల్లో పుత్రక్షోభను మిగిల్చిన సంఘటన జగిత్యాల విద్యానగర్ మిషన్ కాంపౌన్డ్ వద్ద చోటు చేసుకుంది.పోలీస్ ల కథనం ప్రకారం సేంట్ జాన్స్ పాఠశాల లో పదవతరగతి చదువుతున్న ఇద్దరు మైనరు విద్యార్థులు సామాజిక మాధ్యమాలైన ఫెస్బుక్ వాట్సాప్ ల తో పాటు విజ్ఞానం కోసం పుస్తకాలు పట్టాల్సిన ఆ చిన్నారుల చేతులు నీలి చిత్రాలు ధూమ పాణం మద్యం వైపు ఆకర్షితులై దేశానికి వెన్నెముకలా దేశాన్ని ఉద్ధరించే పౌరులు గా తయారు అవ్వాల్సిన వీరు ఇలా కన్న వారి పుత్రక్షోభకు గురిచేసి తణువు చాలించడం దురదృష్టకరం..
సురభి రావు,గల్ఫ్,ప్రవాస కార్మికుడు.
 • సురభి రావు,ఎన్నారై,జగిత్యాల.
 • పిల్లలపై తల్లిదండ్రుల అతిప్రేమ….విచ్చలవిడి తనం…ఖరీదైన స్మార్ట్ ఫోన్లు , బైకులు కొనివ్వడం తో పాటు జేబు ఖర్చులకు ఇవ్వడం ఇవన్నీ కూడా యుక్తవయసులో తెలిసీ తెలియని తనం లో నిండు నూరేళ్ల జీవితం ప్రశార్ధకమ్ అయి కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది
 • రామకృష్ణ కట్కo,గల్ఫ్ ప్రవాస కార్మికుడు,మస్కట్.
 • పోలీసులు అంటే భయం ఉన్నప్పుడే అన్ని బాగా జఫుగుతాయి….
  ఇంకొక్క విషయం సార్ సినిమాల ప్రభావం విద్యార్థుల పై చాలా ఉంటుంది….
  ఇవన్నీ తొలగిపోవాలంటే తల్లిదండ్రుల నియంత్రణ పిల్లల పై తప్పనిసరి…..
రామకృష్ణ కట్కo,గల్ఫ్,ప్రవాస కార్మికుడు.
Please follow and like us:

You may also like...