Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

జగన్‌పై అభిమానంతోనే శ్రీనివాసరావు దాడి

విజయవాడ/బ్యూరో: ప్రతిపక్ష నేత జగన్‌పై కోడి కత్తి దాడి ఘటన ముగిసిన అధ్యాయమని మాజీ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. జగన్‌పై అభిమానంతోనే శ్రీనివాసరావు దాడి చేశారని సీఎం చంద్రబాబుపై ఆరోపణలతో వైసీపీ చులకన అవుతోందన్నారు. దాడి ఘటనతో వైసీపీ లబ్ధి పొందాలని చూసిందని, ఇకనైనా ఇలాంటి పనులు వైసీపీ మానుకుంటే మంచిదని ఆయన సూచించారు. అమరావతిలో భూసమీకరణ చేయడమే చంద్రబాబు తొలి విజయం సాధించారని కొనియాడారు. రాజధానికి వ్యతిరేకంగా విపక్షనేతలు కోర్టులు, ట్రిబ్యునల్‌కు వెళ్లారని, రెండున్నరేళ్ల వరకు ఒక్క అడుగు కూడా వేయకుండా కుట్ర చేశారని మండిపడ్డారు. విపక్షాలు, కేంద్రం కుట్రలను చంద్రబాబు చేధిస్తున్నారని, రెండు, మూడేళ్లలో అమరావతికి రాజధానిరూపం వస్తుందన్నారు. బీజేపీని చాలెంజ్‌ చేసిన పార్టీ టీడీపీ ఒక్కటేనని సబ్బంహరి కితాబిచ్చారు. చంద్రబాబుతో ఎందుకు పెట్టుకున్నామా అని ప్రధాని మోదీ, బీజేపీ నేత అమిత్‌షా పశ్చాత్తాప పడతారని సబ్బంహరి అన్నారు.

Please follow and like us:

You may also like...