చైనా పర్యటన లో మంత్రి నారా లోకేష్…!

బీజింగ్/ చైనా తెలుగు అసోసియేషన్ సభ్యులతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్….

తెలుగు వారు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలి.రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు అంతా కలిసే ఉన్నారు.రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం చైనా లో ఉన్న తెలుగు వాళ్లు కృషి చెయ్యాలి.చైనా లో ఉన్న తెలుగు వాళ్లు అంతా తెలుగు రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్లు గా మారాలి.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కష్టపడుతున్నారు.ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాం అని అన్నారు.

రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు చుట్టుముట్టాయి…లోటు బడ్జెట్,ఇతర దక్షణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి ఆదాయం కూడా తక్కువ ఉంది.సమస్యలు అధిగమించి ,అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం.వరుసగా రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే.దేశంలో అనేక మంది నదుల అనుసంధానం గురించి మాట్లాడారు…కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నదుల అనుసంధానం చేసారని అన్నారు.

గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసారు… పట్టిసీమ ని రికార్డు సమయంలో పూర్తి చేసాం.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుంది.దీని ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకొని వెళ్లడం వలన వెనుకబడిన జిల్లా అనుకున్న అనంతపురం జిల్లా కి ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీ కియా వచ్చిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది.ఐదు జోన్లలో ఐటీ అభివృద్ధి చేస్తున్నాం.ఫ్రాంక్లిన్,హెచ్ సిఎల్,జోహో,కాన్డ్యూయెంట్ లాంటి కంపెనీలు వచ్చాయి.ఎలక్ట్రానిక్స్ లో చైనా అందరి కంటే ముందు ఉంది…ఈ రంగంలో చైనా ని ఆదర్శంగా తీసుకొని…ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఒక్క ఫాక్స్ కాన్ సంస్థ లోనే 15 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నాం.480 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ని మన దేశంలో వినియోగించబోతున్నారు అని ఒక అంచనా ఉంది…అందులో 240 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి చెయ్యాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం.ప్లాస్టిక్స్ దగ్గర నుండి బ్యాటరీ తయారీ వరకూ పూర్తి స్థాయి అభివృద్ధి జరిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్న ఆయన, ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగు వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చెయ్యడానికి ఎపి ఎన్ఆర్టి ఏర్పాటు చేసాం అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ  చైనా లో ఉంటున్నమీరందరు బ్రాండ్ అంబాసిడర్లు గా మారి, మీరు పనిచేస్తున్న కంపెనీల్లో రాష్ట్రం గురించి చెప్పడం మొదలు పెడితే కంపెనీ రాష్టానికి వచ్చే అవకాశాలు పెరుగుతాయి అని అన్నారు.

..

Please follow and like us:

You may also like...