చిన్నారిని కాపాడిన పోలీసులు

గని/సోమయాజులపల్లి: సోమయాజులపల్లి గ్రామానికి చెందిన తెలుగు యెదు పుల్లయ్య మరియు అతని భార్య వరలక్ష్మి లు గని గ్రామానికి చెందిన పుల్లయ్య చిన్నన్న అయిన శేషయ్య ఇంటికి తేదీ 01న సాయంత్రo 6 గంటలకు వచ్చి , 02న ఉదయం నాగమయ్య స్వామిని దర్శించుకున్నారు… నిన్నటి సాయంత్రం సుమారు 6.30 గంటలు సమయంలో పుల్లయ్య గని బస్ స్టాండ్ కు పోతుండగా అతని కూతురు నాగ పావని వయస్సు 3 సంవత్సరాలు కూడా అతనిని వెంట బస్ స్టాండ్ దగ్గరకు వెళ్లగా, పుల్లయ్య ఆ పాపని ఇంటికి పొమ్మని చెప్పి ఇంటికి 50 మీటర్లు దూరంలో వుండే కళ్ళం లో విడిచి అతను అక్కడనుండి మరలా బస్టాండ్ కు పోయినాడు. ఊరికి కొత్త కావటం తో నాగ పావని ఇల్లు కనుక్కోలేక నాగమయ్య కట్టకు మరియు పొలాలకు పోయే రాస్తాలో అమె వెళ్లిపోయి కనపడకుండా పోయినది.

ఈ విషయం నాకు తెలియగానే మా సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్  మీరా సాహెబ్,  పీసీలు శివలింగం, నాగార్జున, శ్రీను, కూర్మయ్య లను తీసుకుని పోయి గని గ్రామానికి చెందిన 100 మంది సహకారంతో అందరికీ సూచనలు ఇస్తూ, రాత్రి పాపకు జంతువుల నుండి హాని వుంటుందేమోనని భయపడి రాత్రంతా లైట్లు వేసుకుంటూ మేము తిరుగుతూ ఊరిలో మాతో పాటు వచ్చిన 100 మందిని తిప్పినాము. అయితే ఈరోజు ఉదయం 8 గంటలపుడు గని గ్రామంలో ఉన్న బృందావనం పక్కన ఉన్న కొండలో నాగ పావని ముళ్ళకంపల మధ్య ఇరుక్కుని ఏడుస్తుండగా అందరం పోయి ఆ పాపను అక్కడనుండి తీసుకుని వచ్చి గని గ్రామం లో ఉన్న ఆర్ ఎంపి డాక్టర్ వద్ద చికిత్స చేయించి వారి తల్లిదండ్రులకు అప్పగించడమైనది.

ఈ సందర్భంగా పాపకు జంతువులు నుండి ఎటువంటి హాని కలగకుండా రాత్రంతా కష్టపడి తిరిగి, ఆ పాపను క్షేమంగా తల్లిదండ్రులు కు అప్పగించిన నన్ను, మా సిబ్బందిని, గ్రామస్తులనుఎస్పీ , డిఎస్పీ గోపాలకృష్ణ  అభినందించడం జరిగింది. నాగ పావని తండ్రి అయిన పుల్లయ్య ఆ పాపను ఇంట్లో వదిలి పెట్టకుండా కల్లంలో వదిలిపేట్టి నిర్లక్ష్యంగా వ్యవరించినందుకు ఈ సంఘటన జరిగింది… ఈ కార్యక్రమం లో పాల్గొన్నగడివేముల  ఎస్సై వెంకటేశ్వరరావు టౌన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...